ఒక బక్క పలచని కుర్రాడు, చూడటానికి నల్లగా ఉన్నాడు ఇలాంటి వ్యక్తి హీరో గా చేస్తే ఎవడు ఆ సినిమా కొంటాడు అని అందరూ అనుకుంటున్న టైం లో కథలో బలం ఉంటే ఏదైనా చేయచ్చు అని నిరూపించిన వ్యక్తి దర్శకుడు శంకర్, ఆ హీరో ప్రభు దేవ.తండ్రి సినిమాలకు కొరియోగ్రాఫర్ కాబట్టి వారసత్వంగా డ్యాన్స్ అబ్బింది.
కానీ అదే డ్యాన్స్ నీ పట్టుదలతో అందరి కన్న విభిన్నంగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ఇతడేనా అని అనిపించే విధంగా చేయడం వల్ల ప్రభు దేవా కు సినిమాలు బాగా కలిసి వచ్చాయి.ఇక్కడా వరకు అంతా బాగానే ఉంది.
కానీ ప్రభు దేవా ను హీరో గా పెట్టి సినిమా తీయడం అంటే సాహసమే.అలాంటి సాహసం చేయడానికి దర్శకుడు రెఢీ గా ఉన్నా నిర్మాత మాత్రం భయపడుతూ ఉన్నాడు.
సదరు నిర్మాత ను ఒప్పించి శంకర్ సినిమా తీయడానికి చాలానే కష్ట పడ్డాడు.సినిమా తీసిన కొనాలంటే పంపిణీ దారులు కూడా ఉండాలి కదా.కానీ కథ మీద దర్శకుడి కి ఉన్న నమ్మకం వల్ల కొంత వరకు సాధ్యం అయ్యింది.ఇక దర్శకుడు శంకర్ అప్పటికే జెంటిల్ మెన్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు.
అందుకే ఆయన్ను నమ్ముకొని కొంత మంది ముందుకు వచ్చారు.శంకర్ కి అంత నమ్మకం రావడానికి కారణం జెంటిల్ మేన్ సినిమా లో చికు బుకు రైలే అనే ఒక పాట కోసం నటించి, నర్తించడమే.ఒంట్లో ఎముకలు ఉన్నాయో లేదో అనే విధంగా ఆ పాట లో హీరోయిన్ గౌతమి తో ఆడి పాడాడు ప్రభు దేవా.
తన కష్టమే తనకు అవకాశాలను తెచ్చి పెట్టింది.అప్పటికే కొన్ని పాటల కోసం తెరపై కనిపించాడు ప్రభు దేవా.ఈ సినిమ కోసం మొదట మాధురి దీక్షిత్ నీ హీరోయిన్ అనుకున్నప్పటికీ అది కుదరలేదు.
ఇక నగ్మా ను ఫైనల్ చేయడం కూడా ఈ చిత్రానికి మంచి ప్లస్ పాయింట్ అయ్యింది.ఈ సినిమా విడుదల అయ్యాక ప్రభు దేవలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనే విధంగా క్రేజ్ సంపాదించుకున్నాడు.
అప్పటి నుంచి చాలా సినిమాల్లో నటించాడు.ఆ తర్వాత తెలుగు తో పాటు హిందీ లో దర్శకత్వం చేపడుతున్నారు.