కొచ్చిలోని వైపిన్ మెట్రో టెర్మినల్( Kochi ) వద్ద పెద్ద చేపల గుంపు నీటిలోంచి దూకుతున్న వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో లక్షల సంఖ్యలో చేపలు నీటిలో నుంచి దూకుతూ ఒక వర్షాన్ని తలపించాయి.
అవి ఎందుకు ఇలా ప్రవర్తించాయో తెలియ రాలేదు కానీ సాధారణంగా చేపలు అడ్డంకులను అధిగమించడం, వేటాడే జంతువులను నివారించడం, ఎరను పట్టుకోవడం లేదా మంచి ప్రదేశానికి చేరుకోవడం వంటి వివిధ కారణాల వల్ల నీటి నుంచి దూకుతాయి.
తాజాగా వెలుగు చూసిన అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో ప్రత్యక్షమయ్యింది.ఆ వీడియోలో ఒక వ్యక్తి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు పెద్ద సంఖ్యలో చేపలు నీటి నుంచి దూకడం కనిపించింది.
కొచ్చి వాటర్ మెట్రో అనేది మెట్రో రైలు నెట్‌వర్క్( Metro Rail Network )తో అనుసంధానించబడిన కొత్త పబ్లిక్ బోట్ సర్వీస్.దీనిని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.ఇలాంటి సర్వీస్ ని తీసుకురావటం ఇదే తొలిసారి.
ఇక ఈ సర్వీస్ లో వాడే బోట్లు హైబ్రిడ్, బ్యాటరీతో నడిచేవి.అలానే ఎయిర్ కండిషన్డ్.
కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) ప్రకారం, నీటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో చేపలు దూకడానికి గల కారణాన్ని ‘సార్డిన్ రన్( Sardine Run )’ అని పిలుస్తారు.సార్డిన్ రన్ అనేది అధిక లవణీయతతో మెరుగైన పోషకాల కారణంగా ఒక రకమైన ఆల్గే బ్లూమ్ ద్వారా ప్రేరేపించబడిన ఒక వింతైన ప్రవర్తన.ఇది తీరం వెంబడి జరగడం సాధారణం.ఇక వైరల్ వీడియోకి ఇప్పటికే మూడు వేలకు పైగా వ్యూస్, 100కు పైగా లైకులు వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.