ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ఐడియా వుంటే ఈ లాజిక్ మిస్సవ్వద్దు!

మనలో చాలామంది భవిష్యత్ తరాలకోసమో, వారికోసమో కొంత మొత్తం ఫిక్సెడ్ డిపాజిట్( Fixed Deposit ) రూపంలో దాచుకోవాలని కలలు కంటూ వుంటారు.దానికోసం రూపాయి రూపాయి దాచుకుంటూ వుంటారు.

 Know More About Fixed Deposits,fixed Deposits,fd Laddering,maturity Period,inte-TeluguStop.com

అయితే ఈ క్రమంలో చాలామంది అనుభవం లేని కరణంగా కొన్ని తప్పులు చేస్తారు.దానివలన పెద్దగా ప్రయోజనాలు చేకూరవు.

ఈ సింపుల్ టిప్ పాటించినట్లయితే మీ దగ్గర ఉన్న డబ్బులతోనే లక్షల్ల రూపాయల్లో ప్రయోజనం పొందవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.స్థిరమైన రాబడి వస్తుందన్న నమ్మకంతో వినియోగదారులు వీటిపై ఇపుడు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని చెప్పుకోవచ్చు.

Telugu Fd, Fd Tenure, Fixed Deposits, Interest Rates, Maturity Period-Latest New

ఒకసారి ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన మొత్తం మెచ్యూరిటీ పీరియడ్( Maturity Period ) అయ్యే వరకూ లాక్ అయి ఉంటుంది.మధ్యలో అత్యవసరం వచ్చినప్పటికీ డబ్బు కావాల్సి వస్తే.తీసుకోడానికి వీలు పడదు.కొన్ని బ్యాంకులు ప్రీ మెచ్యూర్ విత్ డ్రాకు అనుమతించినా.ఫైన్లు విధిస్తాయి.అయితే.

మీరు ఓ స్ట్రాటజీ ద్వారా ఇటువంటి అత్యవసర పరిస్థితులను అధిగమించడంతోపాటు అనేక ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.అదే ఎఫ్‌డీ ల్యాడరింగ్( FD Laddering ).

అవును, కానీ ఎఫ్‌డీ ల్యాడరింగ్ అంటే ఏమిటి? మీ దగ్గర ఉన్న డబ్బులను ఒకే ఎఫ్‌డీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టకుండా మొత్తాలుగా విభజించి ఇన్వెస్ట్ చేయడాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ ల్యాడరింగ్ అంటారు.ఇది లిక్విడిటీ అవసరాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడుతుంది.

Telugu Fd, Fd Tenure, Fixed Deposits, Interest Rates, Maturity Period-Latest New

ఇక్కడ వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్న సమయంలో మంచి లాభాలను అందుకునే అవకాశం వుంటుంది.ఉదాహరణకు మీరు 1 లక్ష రూపాయలను.5 ఏళ్ల ఎఫ్‌డీ చేయదలుచుకుంటే దీనికి బదులుగా మీరు 5 వేర్వేరు ఎఫ్డీ ఖాతాలను ఓపెన్ చేస్తే బావుంటుంది.1 లక్ష రూపాయలను 5 భాగాలుగా విభజించి.ఒక్కొక్క దానిలో 20వేల రూపాయల చొప్పు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి.5 అకౌంట్ల మెచ్యూరిటీ పీరియడ్ వరుసగా.ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు, ఐదేళ్లు ఉండేలా చూసుకోవచ్చు.బ్యాంక్ అందించే వడ్డీ రేట్ల ప్రకారం టెన్యూర్‌( Fixed Deposit Tenure ) వుంటే బెటర్.టెన్యూర్‌, వడ్డీ ప్రకారం పెట్టుబడి పెట్టాలి.ఇలా మీ పెట్టుబడిని విభజించి వేరు వేరు టెన్యూర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా వివిధ సమయాల్లో మెచ్యూరిటీ సొమ్ము మీ చేతికి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube