టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.కేసు విచారణ కోసం హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీల సహకారం తీసుకోవాలని సూచించింది.

 Key Comments Of High Court In Tspsc Paper Leak Case-TeluguStop.com

పేపర్ లీకేజ్ తెలంగాణలో కొత్తగా జరగలేదని ఏజీ కోర్టుకు తెలిపారు.ఇటువంటి ఘటనలు చాలా రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయని వాదనలు వినిపించారు.

ఈ క్రమంలో ఏజీ వాదనలపై స్పందించిన న్యాయమూర్తి మన ఇంట్లో పిల్లలు పరీక్ష రాస్తే ఆ బాధ తెలుస్తుందన్నారు.పరీక్షలను రద్దు చేయడం మంచిదేనన్నారు.

పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేసింది.ఈ క్రమంలో సిట్ నామమాత్రంగా దర్యాప్తు చేస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

దీనిపై స్పందించిన హైకోర్టు సిట్ చీఫ్ పేరేంటి? సిట్ లో ఎవరైనా టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ ఉన్నారా అని ప్రశ్నించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube