తెలుగు సినిమాల్లో ఏ హీరోకి లేని క్రేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) ఉంది అనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంటే రీసెంట్ గా రీ రిలీజ్ అయినా ఖుషి సినిమా కలక్షన్స్ ని చూస్తే మనకే అర్థం అవుతుంది అయితే 2024 లో ఎలక్షన్స్ వస్తున్న నేపధ్యం లో పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నా సినిమాలు చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం సినిమాల విషయంలో కంటే కూడా ఆయన ఎక్కువగా రాజకీయాలపై దృష్టి పెడుతున్నాడు.అయినప్పటికీ సినిమాలని ఎక్కడ నెగ్లెట్ చేయట్లేదు ఇప్పటికే సుజీత్ ఓజీ సినిమాకి( OG Movie ) సంభందించిన ఒక గ్లింప్స్ నీ కూడా వదిలారు అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది…
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, వినోదయ్యా సీతం సినిమాలకి డేట్స్ కేటాయించి ఆ షూటింగ్స్ లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది…ఆయన ఈ సినిమాలని ఈ ఇయర్ లో కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇవి పూర్తి చేస్తే ఆయన ఎన్నికల ప్రచారం లో తిరగడానికి వెళ్తారు అనే చెప్పాలి…ఇక వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఎలక్షన్స్ ఉండటం తో ఆయన ఇప్పటి నుంచే వాటికి ప్రణాళిక లు సిద్దం చేస్తున్నారు…
హీరోగా పవన్ కళ్యాణ్ కు ఇప్పటికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆయన సినిమా అంటే అభిమానులు భారీ ఎత్తున వస్తారు సినిమా మినిమంగా ఉన్నా కూడా వందల కోట్లు వస్తాయి.అయినా కూడా ఆయన రాజకీయాలు ( Politics ) అంటూ బిజీ అవ్వడం పట్ల ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలు పూర్తి చేస్తూనే క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా( Hari Hara Veeramallu ) కూడా తొందర్లోనే విడుదల అవుతుందని తెలుస్తుంది.
రీసెంట్ గా ఈ సినిమాకి సంభందించిన షూట్ కూడా అన్నపూర్ణ స్టూడియో లో జరిగింది, కాగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది…
.