నేనే కాదు- ఆయన్ని కూడా గెలిపిస్తానంటున్న నాని !

రాష్ట్ర రాజకీయాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండే విజయవాడలో గత కొన్ని రోజులుగా రాజకీయం కేసినేని బ్రదర్స్ మధ్యన తిరుగుతుంది .నాని టిడిపిని వీడతారా కలిసే ఉంటారా అన్న విషయంలో ఇప్పటివరకు సాధారణ ప్రజలకే కాక పార్టీ నేతలకు కూడా స్పష్టత లేదని సమాచారం ముఖ్యంగా లోకేష్ విజయవాడ పాదయాత్ర సందర్భంగా కేశినేని నాని( Kesineni Nani ) కనిపించకపోవడంతో ఆయన పార్టీని వీడడం ఖాయమనే అందరూ అంచనా వేశారు .

 Kesineni Confirm His Contest , Kesineni Nani , Tdp Party , Nara Lokesh Politi-TeluguStop.com

అయితే మళ్లీ దివంగత నేత ఎన్టీఆర్ స్మారక నాణాన్ని విడుదల చేసినప్పుడు మాత్రం చంద్రబాబు పక్కనే కనిపించిన నాని ఇప్పుడు టిడిపి నేత బేగ్ జన్మదిన వేడుకల్లో ప్రత్యక్షమై మరోసారి విజయవాడ ఎంపీగా గెలవబోతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు .

Telugu Congress, Kesineni Nani, Chandrababu, Lokesh, Tdp-Telugu Political News

తానే కాకుండా ఈసారి బేగ్ ను కూడా అసెంబ్లీకి నడిపిస్తానని ఆయన ప్రకటించడం గమనార్హం అయితే టిడిపి భవిష్యత్తు వారసుడు లోకేష్ తో విభేదాలు నేపథ్యంలోనే ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది .ముఖ్యంగా విజయవాడ ఎంపీ సీటుకు తనని కాకుండా తన తమ్ముడు చిన్నా ను లోకేష్ ప్రోత్సహించడం, తన పాదయాత్ర బాధ్యతలు కూడా చిన్నికి అప్పజెప్పడం వంటి వ్యవహారాలతో ఆయన లోకేష్ కు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది .అయితే పెద్దాయన చంద్రబాబు ఆశీస్సులు మాత్రం నానికి పుష్కలంగా ఉన్నాయని, విజయవాడ ఎంపీ సీటుపై ఇప్పటికే చంద్రబాబు ( N Chandrababu Naidu )నుంచి నాని హామీ తెచ్చుకున్నారని అందుకే అంత ధీమాగా తనతోపాటు బేగ్ ను గెలిపిస్తానన్న వ్యాఖ్యలు చేశారంటూ విశ్లేషణలు వస్తున్నాయి.

Telugu Congress, Kesineni Nani, Chandrababu, Lokesh, Tdp-Telugu Political News

అయితే వచ్చే ఎన్నికల్లో సీట్ల ఎంపికల లో లోకేష్( Nara Lokesh ) దే కీలక పాత్ర అని వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు హామీ ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది .అయితే టిడిపి టికెట్ దక్కకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసే ఉద్దేశంతో కూడా నాని ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది .మరి పై టిడిపి అభ్యర్థుల లిస్టు ఫైనల్ అయితే కానీ నాని టికెట్టు విషయం పై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube