నేనే కాదు- ఆయన్ని కూడా గెలిపిస్తానంటున్న నాని !

రాష్ట్ర రాజకీయాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండే విజయవాడలో గత కొన్ని రోజులుగా రాజకీయం కేసినేని బ్రదర్స్ మధ్యన తిరుగుతుంది .

నాని టిడిపిని వీడతారా కలిసే ఉంటారా అన్న విషయంలో ఇప్పటివరకు సాధారణ ప్రజలకే కాక పార్టీ నేతలకు కూడా స్పష్టత లేదని సమాచారం ముఖ్యంగా లోకేష్ విజయవాడ పాదయాత్ర సందర్భంగా కేశినేని నాని( Kesineni Nani ) కనిపించకపోవడంతో ఆయన పార్టీని వీడడం ఖాయమనే అందరూ అంచనా వేశారు .

అయితే మళ్లీ దివంగత నేత ఎన్టీఆర్ స్మారక నాణాన్ని విడుదల చేసినప్పుడు మాత్రం చంద్రబాబు పక్కనే కనిపించిన నాని ఇప్పుడు టిడిపి నేత బేగ్ జన్మదిన వేడుకల్లో ప్రత్యక్షమై మరోసారి విజయవాడ ఎంపీగా గెలవబోతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు .

"""/" / తానే కాకుండా ఈసారి బేగ్ ను కూడా అసెంబ్లీకి నడిపిస్తానని ఆయన ప్రకటించడం గమనార్హం అయితే టిడిపి భవిష్యత్తు వారసుడు లోకేష్ తో విభేదాలు నేపథ్యంలోనే ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది .

ముఖ్యంగా విజయవాడ ఎంపీ సీటుకు తనని కాకుండా తన తమ్ముడు చిన్నా ను లోకేష్ ప్రోత్సహించడం, తన పాదయాత్ర బాధ్యతలు కూడా చిన్నికి అప్పజెప్పడం వంటి వ్యవహారాలతో ఆయన లోకేష్ కు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది .

అయితే పెద్దాయన చంద్రబాబు ఆశీస్సులు మాత్రం నానికి పుష్కలంగా ఉన్నాయని, విజయవాడ ఎంపీ సీటుపై ఇప్పటికే చంద్రబాబు ( N Chandrababu Naidu )నుంచి నాని హామీ తెచ్చుకున్నారని అందుకే అంత ధీమాగా తనతోపాటు బేగ్ ను గెలిపిస్తానన్న వ్యాఖ్యలు చేశారంటూ విశ్లేషణలు వస్తున్నాయి.

"""/" / అయితే వచ్చే ఎన్నికల్లో సీట్ల ఎంపికల లో లోకేష్( Nara Lokesh ) దే కీలక పాత్ర అని వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు హామీ ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది .

అయితే టిడిపి టికెట్ దక్కకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసే ఉద్దేశంతో కూడా నాని ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది .

మరి పై టిడిపి అభ్యర్థుల లిస్టు ఫైనల్ అయితే కానీ నాని టికెట్టు విషయం పై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.

హీరోయిన్లను ఇబ్బంది పెట్టే దర్శకులు.. ఒకరు పండుతో కొడితే మరొకరు ఏకంగా లేపేస్తారు..?