ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో కేసీఆర్ భేటీ..!

ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ అభ్యర్థులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.గిరిజనులకు పోడు భూముల పట్టాలు, రైతుబంధు పథకంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం.

 Kcr Met With The Mlas And Candidates Of The Joint Khammam District..!-TeluguStop.com

ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావుతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు, వైరా ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ లాల్ హాజరుకానున్నారు.ఈ క్రమంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ నేతలతో చర్చించనున్నారని సమాచారం.

ఈ మేరకు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలకు అధిష్టానం పిలుపునిచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube