వారికి కేసీఆర్ మార్క్ షాక్ తప్పదా ?

అన్ని పార్టీల కంటే ముందుగా తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించి సంచలన సృష్టించారు బీఆర్ఎస్ ( BRS )అధినేత,  తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM kcr ) .  ఆదివారం తెలంగాణ భవన్ కు కేసిఆర్ రానున్నారు .

 Kcr Mark Shock For Them , Kcr, Brs, Brs Mla Candidates, Bjp, Telangana Electio-TeluguStop.com

ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అభ్యర్థులకు దిశనిర్దేశం చేయబోతున్నారు .అలాగే బీఫాంలు కూడా అందజేయనున్నారు.పెండింగ్ లో ఉన్న ఐదు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించి వారికి బీఫాంలు రేపు అందజేయనున్నారు.ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మార్పు చేర్పులు చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని , అందుకే రేపు కొంతమందికి బీఫామ్ నిరాకరించి కొత్తవారికి అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

దీంతో ఎవరికి బీఫామ్ దక్కుతుంది ? ఎవరికి నిరాశ కలుగుతుందనే విషయంపై బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

Telugu Brs Mla Candis, Marrirajasekhar, Telangana-Politics

 ఆగస్టు 21న బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈనెల 15న కేసీఆర్ ( CM kcr ) తెలంగాణ భవన్ కు వస్తున్నారు.ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎంత మేలు జరిగిందనేది ఏ విధంగా వివరించాలి,  సంక్షేమ, అభివృద్ధిని వివరించే విధానం పైన అనేక సూచనలు చేయబోతున్నారు దీంతోపాటు కాంగ్రెస్ బిజెపిలను ఏ విధంగా కట్టడి చేయాలి ప్రచారంలో ఎటువంటి వ్యవహారాలను అనుసరించాలని విషయం పైన డి ఆర్ ఎస్ అభ్యర్థులకు అనేక సూచనలు చేయబోతున్నారు.  ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలతో పాటు వివిధ ప్రైవేటు సంస్థల సర్వే వివరాలను సైతం కేసీఆర్ ( CM kcr )రేపు వివరించబోతున్నారట.

పార్టీ అభ్యర్థులను ప్రకటించిన రోజే పనితీరు మెరుగుపడని అభ్యర్థులను మారుస్తామని కెసిఆర్ ప్రకటించారు. కెసిఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థులలో దాదాపు ఐదుగురికి టికెట్ దక్కే అవకాశం లేదనే ప్రచారం బీఆర్ఎస్ లో జరుగుతోంది.

Telugu Brs Mla Candis, Marrirajasekhar, Telangana-Politics

ఇక నర్సాపూర్, నాంపల్లి ,జనగామ,  గోషామహల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు .అలాగే మల్కాజి గిరి అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు( Mynampally Hanumanth Rao ) ప్రకటించిన ఆయన రాజీనామా చేయడంతో ఆస్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డి( Marri Rajasekhar Reddy )ని అభ్యర్థిగా ప్రకటించి బీ ఫార్మ్ అందజేయనున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube