వారికి కేసీఆర్ మార్క్ షాక్ తప్పదా ?
TeluguStop.com
అన్ని పార్టీల కంటే ముందుగా తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించి సంచలన సృష్టించారు బీఆర్ఎస్ ( BRS )అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM Kcr ) .
ఆదివారం తెలంగాణ భవన్ కు కేసిఆర్ రానున్నారు .ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అభ్యర్థులకు దిశనిర్దేశం చేయబోతున్నారు .
అలాగే బీఫాంలు కూడా అందజేయనున్నారు.పెండింగ్ లో ఉన్న ఐదు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించి వారికి బీఫాంలు రేపు అందజేయనున్నారు.
ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మార్పు చేర్పులు చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని , అందుకే రేపు కొంతమందికి బీఫామ్ నిరాకరించి కొత్తవారికి అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దీంతో ఎవరికి బీఫామ్ దక్కుతుంది ? ఎవరికి నిరాశ కలుగుతుందనే విషయంపై బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
"""/" /
ఆగస్టు 21న బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈనెల 15న కేసీఆర్ ( CM Kcr ) తెలంగాణ భవన్ కు వస్తున్నారు.
ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎంత మేలు జరిగిందనేది ఏ విధంగా వివరించాలి, సంక్షేమ, అభివృద్ధిని వివరించే విధానం పైన అనేక సూచనలు చేయబోతున్నారు దీంతోపాటు కాంగ్రెస్ బిజెపిలను ఏ విధంగా కట్టడి చేయాలి ప్రచారంలో ఎటువంటి వ్యవహారాలను అనుసరించాలని విషయం పైన డి ఆర్ ఎస్ అభ్యర్థులకు అనేక సూచనలు చేయబోతున్నారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలతో పాటు వివిధ ప్రైవేటు సంస్థల సర్వే వివరాలను సైతం కేసీఆర్ ( CM Kcr )రేపు వివరించబోతున్నారట.
పార్టీ అభ్యర్థులను ప్రకటించిన రోజే పనితీరు మెరుగుపడని అభ్యర్థులను మారుస్తామని కెసిఆర్ ప్రకటించారు.
కెసిఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థులలో దాదాపు ఐదుగురికి టికెట్ దక్కే అవకాశం లేదనే ప్రచారం బీఆర్ఎస్ లో జరుగుతోంది.
"""/" /
ఇక నర్సాపూర్, నాంపల్లి ,జనగామ, గోషామహల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు .
అలాగే మల్కాజి గిరి అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు( Mynampally Hanumanth Rao ) ప్రకటించిన ఆయన రాజీనామా చేయడంతో ఆస్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డి( Marri Rajasekhar Reddy )ని అభ్యర్థిగా ప్రకటించి బీ ఫార్మ్ అందజేయనున్నట్లు సమాచారం.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్16, సోమవారం 2024