నేడు జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో కోహ్లీ, గిల్ బద్దలు కొట్టే రికార్డులు ఇవే..!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మరికొన్ని గంటల్లో ప్రారంభం ఉంది.వన్డే వరల్డ్ కప్ లో హై టెన్షన్ మ్యాచ్ ఏదైనా ఉందంటే అది భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అని మనందరికీ తెలిసిందే.

 These Are The Records That Kohli And Gill Will Break In Today's India-pakistan M-TeluguStop.com

ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ రెండు జట్లు ఆడిన రెండు మ్యాచ్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్లో గెలిచి మూడవ విజయం ఖాతాలో వేసుకోవడం కోసం రెండు జట్లు ప్రయత్నిస్తున్నాయి.

ఈ మ్యాచ్లో పలు రికార్డులు బద్దలు అయ్యే అవకాశం కనిపిస్తుంది.ఆ రికార్డులు ఏమిటో చూద్దాం.

విరాట్ కోహ్లీ:

భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉన్నాడు.విరాట్ కోహ్లీ ( Virat Kohli )మరో 93 పరుగులు చేస్తే.

అత్యంత వేగంగా 26 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్ గా సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.ఇదే కనుక జరిగితే ఈ మైలురాయిని చేరిన సచిన్, కుమార సంగక్కర, పాంటింగ్ జాబితాలో విరాట్ కోహ్లీ చేరనున్నాడు.

Telugu India, Kohli, Latest Telugu, Odi Worl Cup, Pakistan, Rohit Sharma, Tendul

విరాట్ కోహ్లీ పాకిస్తాన్ జట్టుపై 121 పరుగులు చేస్తే.వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లలో పాకిస్తాన్ పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా నిలుస్తాడు.సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ లలో పాకిస్తాన్ తో ఐదు మ్యాచ్లు ఆడి 313 పరుగులు చేశాడు.విరాట్ కోహ్లీ( Virat Kohli ) పాకిస్తాన్ తో 3 మ్యాచ్లు ఆడి 191 పరుగులు చేశాడు.

నేడు జరిగే మ్యాచ్లో సచిన్ రికార్డ్ చేసే అవకాశం ఉంది.

Telugu India, Kohli, Latest Telugu, Odi Worl Cup, Pakistan, Rohit Sharma, Tendul

శుబ్ మన్ గిల్

: డెంగ్యూ ఫీవర్ బారిన పడిన గిల్( Shubman Gill ) నేటి మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) కూడా నేటి మ్యాచ్లో గిల్ ఆడే అవకాశం ఉందని చెప్పాడు.ఈరోజు జరిగే మ్యాచ్లో గిల్ 83 పరుగులు చేస్తే ఓ అరుదైన ఘనత సాధిస్తాడు.

గిల్ తన కెరీర్ లో 35 వన్డే ఇన్నింగ్స్ లలో ఆడి 1917 పరుగులు చేశాడు.గిల్ మరో 83 పరుగులు చేస్తే 36 ఇన్నింగ్స్ లలో 2వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube