బ్రేకప్ తో మంచి జరిగింది.. నా పెళ్లి అలా జరగాలి.. కంగనా కామెంట్స్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

బాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే నటీమణులలో కంగనా రనౌత్ ( kangana ranaut )ఒకరు కాగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే.తాజాగా కంగనా తన బ్రేకప్ గురించి, ఇతర విషయాల గురించి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో( Social media ) వైరల్ అవుతున్నాయి.

 Kangana Ranaut Shocking Comments Goes Viral In Social Media Details Here , Kan-TeluguStop.com

ఎలాంటి సంబంధాలు అయినా ఎప్పుడూ ఒకే రకంగా ఉండవని ఆమె అన్నారు.ప్రేమ విషయంలో అందరూ సక్సెస్ సాధించలేరని ఆమె తెలిపారు.

నేను కూడా తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడ్డానని అయితే కొన్ని కారణాల వల్ల విడిపోయామని కంగనా చెప్పుకొచ్చారు.బ్రేకప్ వల్ల నాకు మంచే జరిగిందని ఒకవేళ ఇప్పటికీ నేను ప్రేమలో ఉన్నట్లయితే ప్రేమ కోసం సమయం కేటాయించాల్సి వచ్చేదని ఆమె పేర్కొన్నారు.అదృష్టవశాత్తూ నాకు బ్రేకప్ జరిగిందని ఆమె అన్నారు.లవ్ ఫెయిల్యూర్ వల్ల కలిగే లాభాలు ఆలస్యంగా తెలుస్తాయని కంగనా చెప్పుకొచ్చారు.

ప్రతి అమ్మాయి తన పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ గురించి కలలు కంటుందని నేను కూడా కుటుంబ వ్యవస్థలకు గౌరవం ఇస్తానని కంగనా పేర్కొన్నారు.పెళ్లి చేసుకోవాలని నాకంటూ ఒక కుటుంబం ఉండాలని అనుకుంటానని ఆమె అన్నారు.రాబోయే ఐదేళ్లలో నేను పెళ్లి చేసుకుంటానని ఆ వివాహం పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అయ్యి ఉండాలని కంగనా వెల్లడించారు.కంగనా రెమ్యునరేషన్( Remuneration ) భారీ స్థాయిలో ఉంది.

రాబోయే రోజుల్లో కంగనా మరిన్ని భారీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని చెప్పిన కంగనా ఆ మాటలను నిజం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

కంగనా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకుంటారో లేదో చూడాలి.కంగనాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

కంగనా చెప్పిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube