Kanagana Ranaut Adipurush : ఆదిపురుష్ మూవీపై అలాంటి వ్యాఖ్యలు చేసిన కంగాన.. ఆ విషయాన్ని ఊహించగలరా అంటూ?

బాలీవుడ్ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌( Kangana Ranaut ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది కంగనా రనౌత్‌.

 Kangana Ranaut Indirect Comments On Adipurush-TeluguStop.com

ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో జరిగే విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తలు నిలుస్తూ ఉంటుంది.సినిమాల ద్వారా అలాగే కాంట్రవర్సీడ్ ల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది కంగనా రనౌత్‌.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. రామాయణం( Ramayanam )లోని కొన్ని ఘట్టాలకు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసిన ఆమె రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఒక సినిమాలోని పాటను జోడించారు.

Telugu Adipurush, Indirect, Kangana Ranaut, Prabhas, Tollywood-Movie

ప్రస్తుతం ఉన్న వాళ్లతో పోలిస్తే కొన్ని సంవత్సరాల క్రితం ప్రజల భాష వారి అలవాట్లు, వాళ్ల ప్రేమాభిమానం ఎంతో భావోద్వేగంతో కూడినవిగా ఉండేవి.అలాంటప్పుడు ఏడు వేల సంవత్సరాల క్రితం ప్రజలు ఎలా ఉండేవారు? వాళ్ల వేషధారణ ఎలా ఉండేదో కనీసం మీరు ఊహించగలరా? అని రాసుకొచ్చింది కంగాన.అయితే ఆమె ప్రభాస్( Prabhas Adipurush ) నటించిన ఆదిపురుష్‌ సినిమాను ఉద్దేశించి చేసింది అని నెటిజన్స్ కామెంట్‌ చేస్తున్నారు.ఈ సినిమాతో పాటు కంగనా మరో చిత్రంపై కూడా కామెంట్‌ చేసింది.

నితీశ్‌ తివారి( Nitesh Tiwari ) దర్శకత్వంలో రానున్న రామాయణం సినిమాపై కూడా ఆమె ఘాటుగా స్పందించింది.

Telugu Adipurush, Indirect, Kangana Ranaut, Prabhas, Tollywood-Movie

అందులో రాముడిగా రణబీర్‌ కపూర్‌( Ranbir Kapoor ), సీతగా ఆలియా భట్‌ నటించబోతున్నారని బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.దీనిపై గురించి కంగనా స్పందిస్తూ.ఇటీవల శివుడిగా ప్రకటించుకున్న ఈ నటుడికి ఇప్పుడు రాముడు కావాలనే కోరిక పుట్టింది అని రాసుకొచ్చింది.

కంగాన కావాలనే ఉద్దేశం పూర్వకంగా ఇన్ డైరెక్ట్ గా ఆదిపురుష్ సినీమాపై ఆ విధంగా కామెంట్ చేసింది అని ప్రభాస్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఆది పురుష్ సినిమా విషయానికి వస్తే ఇటీవలె విడుదలైన ఈ సినిమా కలెక్షన్ ల కురిపిస్తూ దూసుకుపోతోంది.

మరోవైపు విమర్శలను నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube