రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.దశాబ్ది వేడుకలలో భాగంగా హరితహారం కార్యక్రమంలో 19.29 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ లో పదిశాతం గ్రీన్ బడ్జెట్ ను కేటాయిస్తుంది.
హరితహరంకు ముందు తెలంగాణలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.తెలంగాణ వ్యాప్తంగా 19,472 పల్లె ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.అదేవిధంగా 2,275 బృహత్ పల్లె ప్రకృతి వనాలు, రూ.700 కోట్లతో 179 అర్బన్ ఫారెస్ట్ లను ఏర్పాటు చేసింది.







