కమల్ హాసన్ లీడ్ రోల్ లో లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా విక్రం. సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లు కూడా తమ నటనతో సత్తా చాటారు.
నిడివి కొద్దిసేపే అయినా రోలెక్స్ పాత్రలో సూర్య కూడా అదరగొట్టారు.కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో విక్రం సినిమా తెరకెక్కించారు.
రిలీజైన 18 రోజుల్లో 300 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో రికార్డులు సృష్టించింది విక్రం మూవీ.
ఇక ఈ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు చిత్రయూనిట్.
సినిమా థియేట్రికల్ రిలీజైన 6 వారాలకు ఓటీటీ రిలీజ్ అవుతుంది. విక్రం సినిమా జూలై 8న డిస్నీ + హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది.
థియేటర్ లో సూపర్ హిట్టైన ఈ మూవీ తప్పకుండా ఓటీటీలో కూడా అదరగొడుతుందని అంటున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన విక్రం సినిమా తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ సినిమా రిజల్ట్ తో కమల్ సూపర్ జోష్ లో ఉన్నారు.అంతేకాదు సినిమా హిట్ అవడంతో మొదలు పెట్టి ఆగిపోయిన తన సినిమాలన్ని లైన్ లో పెడుతున్నారు కమల్.