నందమూరి కళ్యాణ్ రామ్ ( Kalyan Ram ) హీరోగా తాజాగా డెవిల్ సినిమా ( Devil Movie )ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అభిషేక్ నామ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సంయుక్త మీనన్ ( Samyuktha Menon ) నటించిన ఈ సినిమా నేడు డిసెంబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.స్టార్ హీరో కావలసిన అన్ని క్వాలిటీస్ ఈయనలో ఉన్నప్పటికీ కథల ఎంపిక విషయంలో తడబడటంతో కళ్యాణ్ రామ్ సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారని చెప్పాలి.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత కళ్యాణ్ రామ్ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.మరి నేడు విడుదలైనటువంటి ఈ డెవిల్ సినిమా కథ ఏంటి? అసలు ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
కథ: బ్రిటిష్ కాలంలో ఒక రాజు కుటుంబంలో మర్డర్ జరిగి ఉంటుంది.అయితే ఆ మర్డర్ ఎలా జరిగింది? ఎవరు చేశారని ఇన్వెస్టిగేషన్ చేయటానికి ఆ ఇంట్లోకి కళ్యాణ్ రామ్ వస్తాడు.ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కళ్యాణ్ రామ్ కి కొన్ని సంచలన విషయాలు తెలియడంతో ఆశ్చర్యపోతారు.అందులో భాగంగానే ఆ మర్డర్ కి బ్రిటిష్ సీక్రెట్ మిషిన్ కి మధ్య సంబంధం ఉందని తెలుసుకున్న అధికారులు కళ్యాణ్ రామ్ తో ఆపరేషన్ టైగర్ హంట్ మొదలు పెడతారు.
దాంతో ఆ హత్యకి బ్రిటిషర్స్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఈ మిషన్ కోసం కళ్యాణ్ రామ్ ప్రాణాలు తెగించి సాహసం చేయటానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై సినిమా కథ మొత్తం నడుస్తుంది.
నటీనటుల నటన: ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు అని చెప్పాలి.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నటి సంయుక్త మీనన్ కూడా ఈ సినిమా సక్సెస్ కు కారణమయ్యారు.ఈ సినిమా ద్వారా ఈమె తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు వీరితో పాటు ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.
టెక్నికల్: ఈ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి అభిషేక్ నామ( Abhishek nama ) అద్భుతమైనటువంటి సన్నివేశాలను తెరపై చాలా క్లియర్ గా చూపించారు.సౌందర్య రాజన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా హైలెట్ గా నిలిచింది.ఇక సంగీతం విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది.అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్ ని ఎలివేట్ చేయడంలో ఎంతో దోహదం చేశాయని చెప్పాలి.
ఎడిటింగ్ కూడా అంతే అద్భుతంగా ఉందని చెప్పాలి.
విశ్లేషణ: హర్షవర్ధన్ రామేశ్వర్ ( Harshavardhan Rameshwar )అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది.అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్ ని ఎలివేట్ చేయడంలో సక్సెస్ అందించారు ఫస్ట్ అఫ్ మొత్తం మామూలుగానే కథ నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం కళ్యాణ్ రామ్ పాత్రకు ఒక్కసారిగా హైప్ వచ్చిందని చెప్పాలి.అక్కడక్కడ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయనే చెప్పాలి మొత్తానికి సరికొత్త కథ ద్వారా కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరొక హిట్ అందుకున్నారనీ చెప్పాలి.
ప్లస్ పాయింట్స్: సెకండ్ పార్ట్ హైలెట్ కావడం కళ్యాణ్ రామ్ నటన మ్యూజిక్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.
మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీస్తూనే వచ్చారు.
బాటమ్: ఈ తరహా చిత్రాలు ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పాలి ఇలాంటి బోర్ లేకుండా ఈ సినిమాని ప్రేక్షకులు చూడవచ్చు.
రేటింగ్ :3/5