తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచి మళ్ళీ పార్టీలో నూతన ఉత్సాహం తీసుకొచ్చే విధంగాను, ప్రజల్లో బీఆర్ఎస్( BRS party ) కు ఆదరణ మళ్లీ పెరుగుతోంది అనే సంకేతాలను పంపించేందుకు సిద్ధమవుతోంది .అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ఎంపీ స్థానాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది .
ఎప్పటికప్పుడు కీలక నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ , పగడ్బందీగా ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తున్నారు.ఇక తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు .ఒకవేళ సోనియా( Sonia Gandhi ) కానీ పక్షంలో ప్రియాంక గాంధీ నైనా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దించాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు .
వారు ఇక్కడి నుంచి పోటీకి దిగితే ఆ ప్రభావం తెలంగాణ అంతటా కనిపిస్తుంది అని, వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు సాధించేందుకు దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు .ఇప్పటికే రెండు ,మూడు నియోజకవర్గాలను వారికోసం పరిశీలిస్తున్నారు.1980లో తెలంగాణలోని మెదక్ పార్లమెంటు నుంచి ఇందిరా గాంధీ ఒకసారి పోటీ చేసి గెలుపొందారు .ఆ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న 15 పార్లమెంట్ సీట్లకు 15 కాంగ్రెస్ గెలుచుకుంది.ఇప్పుడు ఆ స్థాయిలో ప్రభావం చూపించే విధంగా సోనియా లేదా ప్రియాంకను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు .
ఈ విషయంలో కాంగ్రెస్ అగ్ర నేతలు సైతం సానుకూలంగా ఉండడంతో, ప్రియాంక , సోనియాలలో ఒకరు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.అదే జరిగితే వీరిద్దరిలో ఎవరు పోటీ చేసినా, టిఆర్ఎస్ తరఫున కవిత( kalvakuntla Kavitha )ను రంగంలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నారట.సోనియా లేదా ప్రియాంకకు సరైన ప్రత్యర్థి కవిత అవుతారని, వారిపై కవితను గెలిపించి బీఆర్ఎస్ సత్త చాటుకోవాలని కేసిఆర్ చూస్తున్నారు
.