కాలా ఎంత పెద్ద డిజాస్టరో తెలిస్తే షాక్‌ అవుతారు

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కెరీర్‌ ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు చేశాడు.అయితే రజినీకాంత్‌ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది.

 Kala Movie The Biggest Disaster In Rajini Carrier-TeluguStop.com

ఒక వేళ ఫ్లాప్‌ అయినా కూడా 60 నుండి 75 శాతం వరకు పెట్టుబడి వస్తుంది.కాని మొదటి సారి ‘కాలా’ చిత్రానికి మాత్రం దారుణమైన కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి.

రజినీకాంత్‌ అంతకు ముందు చిత్రం ‘కబాలి’ ఫ్లాప్‌ అయినా కూడా మంచి వసూళ్లు నమోదు చేసింది.డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలను మిగల్చలేదు.

కాని తాజాగా వచ్చిన ‘కాలా’ చిత్రం మాత్రం డిస్ట్రిబ్యూటర్ల పాలిట శాపం అయ్యింది.

‘కాలా’ చిత్రంపై భారీ అంచనాలున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కలిపి ఏకంగా 165 కోట్లకు అమ్ముడు పోయింది.

తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, కేరళలో ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయడం జరిగింది.కర్ణాటకలో ఈ చిత్రం విడుదలకు కొన్ని అడ్డంకులు వచ్చాయి.అయినా కూడా విడుదలకు ప్రయత్నాలు చేశారు.ఇక తమిళనాడులో ఈ చిత్రం కేవలం 33 కోట్ల షేర్‌ను దక్కించుకుంది.

ఇతర రాష్ట్రాల్లో కూడా నామమాత్రపు షేర్‌ను కాలా దక్కించుకుంది.మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కాలా కేవలం 75 కోట్ల షేర్‌ను రాబట్టడం జరిగింది.

తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్లు కాస్త ఒడ్డున పడ్డా కూడా తెలుగు రాష్ట్రాలు మరియు కేరళలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగారు.ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో కనీసం 15 శాతం కూడా రాలేదు అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.రజినీకాంత్‌ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా ఈ చిత్రం నిలిచింది.ఈ మద్య కాలంలో తమిళనాట రజినీకాంత్‌ దక్కించుకున్న అతి తక్కువ వసూళ్లు ఈ చిత్రం ద్వారానే నమోదు అయ్యాయి.

రజినీకాంత్‌ సినిమా అనగానే ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోతున్న కారణంగా ప్రేక్షకులు సరే ఒకసారి చూసేద్దాం అనే దోరణిలో ఉండటం లేదు.

గతంలో సినిమా ఫ్లాప్‌ అయినా కూడా స్టార్‌ హీరో మూవీ కనుక ఒకసారి చూసేద్దాం అనుకునేవారు.కాని ప్రస్తుత పరిస్థితి అలా లేదు.

సినిమా బాగాలేదనే టాక్‌ వస్తే త్వరలోనే పైరసీ వస్తుంది లేదంటే టీవీలో వస్తుంది కదా ఎందుకు వెళ్లడం అనుకుంటున్నారు.అందుకే కాలా చిత్రానికి ఇలాంటి పరిస్థితి దాపరించింది అంటూ డిస్ట్రిబ్యూటర్లు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు ఇటీవల ‘కాలా’ నిర్మాత ధనుష్‌ను సంప్రదించే ప్రయత్నం చేశారు.కాని సాద్యం కాలేదు.

రజినీకాంత్‌ కూడా అందుబాటులో లేడు.డిస్ట్రిబ్యూటర్లు నట్టేట మునిగినట్లే.

రజినీకాంత్‌ కూడా ఆదుకునేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube