వంక లేనమ్మా డొంక పట్టుకుని ఏడ్చిందట ! అలా ఉంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పని.కాంగ్రెస్ పార్టీతో అంతర్గతంగా స్నేహబంధం కొనసాగించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆయన ఢిల్లీకి స్పెసైల్ ఫ్లయిట్ వేసుకుని మరీ వెళ్లారు.
మొన్న లోక్ సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ ప్రసంగించారు.అయితే అందులో ఎక్కడ ఏపీ గురించి రాహుల్ ప్రస్తావన తీసుకురాలేదు .అయితే బాబు మాత్రం అవిశ్వాసానికి మద్దతు పలికిన వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఢిల్లీ టూర్ అని చెప్పి అక్కడ జాతీయ మీడియాతో సుదీర్ఘ సమావేశం ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో జాతీయ మీడియా సమావేశంలో బాబు మీడియా ప్రతినిధులకు అసహనం కలిగించారు.
బాబు ఉద్దేశం జాతీయ మీడియాలో బాగా ఫోకస్ అవ్వడమే అయినా … అక్కడ కూడా తన పాత చింతకాయ పచ్చడి స్టోరీ నే చెప్పుకొచ్చారు.మీడియా ప్రతినిధులు అడక్కపోయినా.
తన రాజకీయ ప్రస్థానం అంతా చెప్పుకుంటూ వెళ్లిపోయారు.హైదరాబాద్‌ను నిర్మించింది తానేనన్నారు.
తన వల్లే ఎయిర్‌పోర్టు, ఐటీ, ఫ్లైఓవర్లు వచ్చాయని చెప్పారు.బిల్ గేట్స్ తో పది నిమిషాలు మాట్లాడేందుకు సమయం కోరితే.
ఆయన ఏకంగా తన ప్రజెంటేషన్ చూసి ఇంకా ఎక్కువ సమయం కేటాయించారు అంటూ చెప్పారు.

గతంలో తను ప్రధాని అయ్యేందుకు అవకాశం వచ్చిందన్నారు.మీరు తప్పనిసరిగా ప్రధానిగా ఉండాల్సిందేనని చాలా మంది ఒత్తిడి తెచ్చారని జాతీయ మీడియాకు చంద్రబాబు చెప్పారు.తాను ఎంతో నిజాయితీ పరుడినని వివరించారు.
ఢిల్లీ వెళ్లినా జగన్‌పైనా విమర్శలు కొనసాగించారు.వైసీపీ ఒక అవినీతి పార్టీ అని విమర్శించారు.
పవన్ కల్యాణ్ ఎందుకు వరుసగా తమకు వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.కేసీఆర్ పరిణితి సాధించి పాలన చేస్తుంటే చంద్రబాబు మాత్రం నిత్యం గొడవలు పెట్టుకుంటున్నారని మోడీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ మాటలు నన్ను చాలా బాధపెట్టాయంటూ ఆవేదన చెందారు.
కర్నాటకలో గాలి జనార్దన్ రెడ్డి అనుచరులకు బిజెపి టికెట్లు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.
తాను వైసీపీ ట్రాప్‌లో పడ్డానని మోదే చెప్తున్నారని, కానీ తాను ఏ తప్పు చేయనని ఆరోజే మోడీకి చెప్పానన్నారు.ఇలా వరుసగా తన సొంత డప్పు కొట్టుకుంటూ ఆవు కథలా చెప్తూనే మీడియా ప్రతినిధులకు విసుగు తెప్పించాడు.








