వెండితెర చందమామగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించినటువంటి కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె చందమామ అనే ట్యాగ్ తోనే ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా కొనసాగుతున్నారు.
ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన కాజల్ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకొని కొంత సమయం పాటు ఇండస్ట్రీకి విరామం ఇచ్చారు.
పెళ్లి జరిగిన వెంటనే ఈమెకు కుమారుడు కూడా జన్మించడంతో ఇండస్ట్రీకి దూరమైనటువంటి కాజల్ తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే ఈమె కమల్ హాసన్ సరసన నటించిన ఇండియన్ 2 ( Indian 2 ) సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.అలాగే బాలకృష్ణ అనిల్ రావిపూడి( Anil Ravupudi ) కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నటువంటి శ్రీ లీల ఈ సినిమాలో కూడా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసేసుకున్నారు.
ఇక ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాగా సత్యభామ అనే సినిమాని కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుంది ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇకపోతే ఈమె ఎప్పటికప్పుడు తన క్యూట్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు.తాజాగా ట్రెడిషనల్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా క్యూట్ గా ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇక ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో నటి రాశి ఖన్నా ( Raashi Khanna )ఈ ఫోటోలపై స్పందిస్తూ ప్రిటీ ఉమెన్ అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.