సారీ చెప్పిన కచ్చా బాదామ్ సింగర్.. కారణం ఏంటంటే?

గల్లీలో పల్లీలు అమ్ముకునే ఓ వ్య‌క్తి.ఒక్క పాట‌తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యాడు.

 Kacha Badam Singer Bhuban Badyakar Apologises For Celebrity Comments, Kacha Bada-TeluguStop.com

అత‌నే పశ్చిమ బెంగాల్​కు చెందిన భుబన్.క‌చ్చా బాదామ్ అనే పాట‌తో భుబన్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు.

ఎంతో మంది అభిమానులను సంపాదించు కున్నాడు.దీనితో అతని జీవితమే మారిపోయింది.

అతను పాడిన పాట సోషల్ మీడియా ను ఒక ఊపు ఊపేసింది.సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పాటకు స్టెప్పులు వేస్తూ రీ క్రియేట్ చేస్తూ లక్షలాది వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇతను పాడిన ఒకే ఒక పాట ఇతనిని ప్రపంచవ్యాప్తంగా ఒక స్టార్ ను చేసేసింది.ఊహించని విధంగా రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయాడు భుబన్.

ఇటీవలే భూబన్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.ఆ ప్రమాదం నుంచి డిశ్చార్జ్ అయి కోలుకున్నాడు.

అయితే భూబన్ అంతకు ముందు ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను ఆర్టిస్ట్ గా ఉండాలను కుంటున్నాను.ప్రస్తుతం నేను సెలబ్రిటీగా మారిపోయాను.

ఈ స్థితిలో పల్లీలను అమ్మితే అవమానకరంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.

Telugu Bhuban Badyakar, Kacha Badam-Movie

ఇదిలా ఉంటే తాజాగా భుబన్ కు సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా అతను మాట్లాడుతూ.ఆ మాటలను ఆ రోజు అని ఉండ కూడదు.

ఆ రోజు అలా మాట్లాడినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను.ప్రజలే నన్ను సెలబ్రిటీ ని చేశారు.

కాబట్టి తప్పని పరిస్థితులు ఎదురైతే మరోసారి పల్లీలు అమ్మడం మొదలు పెడతాను అని చెప్పుకొచ్చాడు భుబన్.ఒక్క పాటతో ప్రపంచ వ్యాప్తంగా అందరి నుంచి నాకు ప్రేమ లభించింది.

అంత మంది ప్రేమ లభించాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి.నేను పెద్ద సెలబ్రిటీ గా మారినప్పటికీ సాధారణ జీవితాన్ని మాత్రమే నేను గడుపు తున్నాను.

వ్యక్తిగా నేను ఏమాత్రం మారలేదు అని భుబన్ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube