టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ఎన్టీఆర్ ( NTR ) ఒకరు.ఈయన బాల నటుడుగానే ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇకపోతే ఎన్టీఆర్ చిన్న వయసులోనే హీరోగా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి చిన్న వయసులోనే పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ హరికృష్ణ ( Hari Krishna Son ) కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే.
హరికృష్ణ రెండో భార్య కుమారుడు కావడంతో నందమూరి ఫ్యామిలీ( Nandamuri Family ) ఎన్టీఆర్ దూరం పెడుతూ వచ్చారు.ఇక ఎన్టీఆర్ స్టార్ హీరో అయినప్పటికీ ఈయనకు నందమూరి ఫ్యామిలీతో పెద్దగా అటాచ్మెంట్ లేవనే చెప్పాలి.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.మీరు స్టార్ హీరో( Star Hero ) అయ్యే వరకు కూడా హరికృష్ణ గారు మిమ్మల్ని కొడుకుగా ఎవరికి పరిచయం చేయలేదట అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం చెబుతూ అలా ఎందుకు అనుకోవాలి తన కొడుకని చెప్పుకునే సందర్భం ఎప్పుడూ రాకపోయి ఉండొచ్చు కదా అంటూ చాలా పాజిటివ్గా తీసుకొని ఎన్టీఆర్ సమాధానం చెప్పారు.
తన తండ్రిపై ఎలాంటి కోపం లేదని తారక్ తెలిపాడు.
నా తండ్రి అంటే నాకు పిచ్చ ఇష్టం.ఎలాంటి కోపం లేదు.
నా కుటుంబంపై నాకు ఎలాంటి కోపం లేదు.ఇది పరిస్థితుల ప్రభావం మాత్రమే అని తారక్ తెలిపాడు.
ఇక బాలకృష్ణ( Balakrishna ) గురించి కూడా ఈయన చాలా పాజిటివ్ గా మాట్లాడాడు.బాలయ్య బాబాయ్ నాతో ఎలా ఉంటారు అనేది కేవలం నాకు తెలుసు.
మా తాతగారు ఎన్టీఆర్( Senior NTR ) నన్ను పలకరించడానికి 11 ఏళ్ళు పట్టింది.మా బాబాయ్ లు, మేనత్తలకు 20 ఏళ్ళు పట్టేదేమో.ఎప్పటికైనా కుటుంబం కలవాల్సిందే కదా అని జూ.ఎన్టీఆర్ అన్నాడు ఈ విషయంలో తనకు ఎలాంటి బాధ లేదని మనం దేనినైనా పాజిటివ్గా తీసుకుంటే ఎలాంటి బాధలు ఉండవు అంటూ ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక నాన్న నుంచి తన కుటుంబ సభ్యులు 11మంది అమ్మ వైపు 9 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఎటువైపు చూస్తున్న నాదొక పెద్ద ఫ్యామిలీనే అంటూ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.