మాజీమంత్రి నారాయణ బెయిల్ రద్దుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కేసులో విచారణ జరిపిన చిత్తూరు కోర్టు నారాయణ బెయిల్ ను రద్దు చేసిన విషయం తెలిసిందే.
అనంతరం ఈనెల 30న న్యాయస్థానం ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో నారాయణ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో పెట్టింది.తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అతనిపై చర్యలు వద్దని ధర్మాసనం స్పష్టం చేసింది.