అర్ధరాత్రి 12 గంటలకు చరణ్ కారెక్కి వెళ్లిపోయేవాడిని.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం డైరెక్టర్ అనిల్ రావిపూడితో సరదాగా చిట్ చాట్ చేశారు.

 Jr Ntr Went With The Charan At 12 Am In His Car Ntr Comments Details, Jr Ntr, R-TeluguStop.com

ఇలా ఈ ఇంటర్వ్యూలో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ తో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు.

రామ్ చరణ్ తో తన అనుబంధం ఈ సినిమాతో ఏర్పడింది కాదని ఎప్పటి నుంచో మా ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉందని తెలిపారు.రామ్ చరణ్, మా ఇల్లు కొద్దిగా దగ్గరగా ఉండటం వల్ల తరచు మేము కలిసే వాళ్ళమని ఎన్టీఆర్ వెల్లడించారు.

ఇకపోతే మార్చి 26 నా భార్య ప్రణతి పుట్టినరోజు.అలాగే మార్చి 27వ తేదీ చెర్రీ పుట్టిన రోజు.26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో చరణ్ కారు తీసుకుని మా ఇంటికి వచ్చేవారు.అలా తన కారు ఎక్కి వెళ్లి చరణ్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకునేవాళ్లమంటూ ఎన్టీఆర్ చరణ్ తో ఉన్న అనుబంధం గురించి తెలిపారు.

Telugu Anil Ravipudi, Jr Ntr, Rajamouli, Ram Charam, Ramcharan, Rrr, Tollywood-M

ఇక ఆ సమయంలో నేను ఇంట్లో లేకపోతే ప్రణతి ఫోన్ చేసి ఈ రోజు నా బర్త్ డే మీరు ఎక్కడున్నారు అంటూ అడిగేదని, ఆల్రెడీ పన్నెండు దాటింది, నీ బర్త్‌డే అయిపోయింది అని చెబుతూ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకునేవాళ్ళం అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు.ఇక ఈ సినిమాతో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడిందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube