సుజాత ఎలిమినేషన్‌లో అభిజిత్‌ ఇష్యూ పాత్ర ఎంత?

బిగ్ బాస్ ఈ సీజన్ 5 వారాలు పూర్తి చేసుకుంది.గత వారం ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయిన జోర్దార్ సుజాత నిన్నటి ఎపిసోడ్‌ లో ఎలిమినేట్ అయింది.

 Jordar Sujatha Eliminated Sujatha, Abhijith, Amma Rajashekar, Nagarjuna, Nagarju-TeluguStop.com

ఈమె ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు గా ముందు రోజే లీక్ వచ్చింది.అంతకు ముందు గంగవ్వ సుజాత వెళ్లే అవకాశం ఉన్నట్లుగా చెప్పి వెళ్ళింది.

నిన్నటి ఎపిసోడ్ లో ఆమె అన్నట్టుగానే సుజాత ఎలిమినేట్ అయింది.నిన్నటి ఎపిసోడ్ సండే ఫన్ డే అన్నట్లుగానే సాగింది.

సినిమా పేర్లను గెస్ చేస్తూ ఆట కొనసాగింది.ఒక్కొక్క టైటిలు ఒక్కొక్క లకు సూటయ్యే లా బిగ్ బాస్ పోస్టర్లను తయారు చేయించడం జరిగింది.

ఆట చాలా రసవత్తరంగా సాగిపోతున్న సమయంలో సుజాతను ఎలిమినేట్ చేస్తున్నట్లుగా నాగార్జున ప్రకటించాడు.

ఒక్కొక్కరిని సేవ్‌ చేస్తూ చివరకు అమ్మ రాజశేఖర్ మరియు సుజాత లో మిగిలి ఉండగా ఐస్ క్యూబ్‌ లో ఉన్న ఫోటోలో ఎవరు అయితే ఉంటారో వారు ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున చెప్పడంతో అమ్మ రాజశేఖర్ మరియు సుజాత పగలగొట్టడం ప్రారంభించారు.

కొద్ది సమయం తర్వాత అందులో నుంచి ఒక ఫ్రేమ్ బయటకు వచ్చింది అందులో సుజాత ఫోటో ఉంది.దాంతో సుజాత నువ్వు ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించాడు.

సుజాతను అంతా కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి పంపించారు.నాగార్జున వద్దకు వెళ్ళిన తర్వాత సుజాత స్టేజిపై కొద్ది సేపు సందడి చేసింది.

ఇంట్లో సభ్యుల గురించి ఒక్కొక్కరు చొప్పున మాట్లాడుతూ ప్రతి ఒక్కరి తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.అభిజిత్ ని మరోసారి సుజాత కన్ఫ్యూజ్ లోకి నెట్టేసింది.

ఆమె చేసిన కన్ఫ్యూజ్‌ కారణంగానే ప్రేక్షకులు ఆమెను ఎలిమినేట్ చేశారంటూ ఇప్పటికే టాక్‌ ఉంది.అభిజిత్‌ విషయంలో సుజాత వ్యవహరిస్తున్న తీరు అర్థం కాలేదు.

ఆమె ఏ ఉద్దేశంతో అభిజిత్‌ ను చూస్తుందో క్లారిటీ లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఆమెను వ్యతిరేకించడం మొదలు పెట్టారు.

అభిజిత్ విషయం అప్పట్నుంచి సుజాత విషయంలో ప్రేక్షకులు విమర్శనాత్మకంగా వ్యవహరించారు.

ఆమె అర్థం పర్థం లేని నవ్వు వల్ల కూడా ఆమె ఎలిమినేట్‌ అయ్యి ఉంటుందనే టాక్‌ ఉంది.ఇక నాగార్జునను బిట్టు అంటూ పిలవడం కూడా చేసింది.

అందుకే అప్పటి నుంచి ఆమె ఎలిమినేషన్ లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన ప్రేక్షకులు ఈవారం ఎలిమినేషన్ లోకి రావడంతో బయటకు పంపించేశారు.ఐదు వారాల జర్నీ తర్వాత బిగ్ బాస్ ను వదిలి సుజాత బయటకు వచ్చేసింది.

ఇదే ఈ వారం లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది వచ్చే ఆదివారం తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube