జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికార పార్టీ బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.బొగ్గు గని కార్మిక సంఘం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో వివాదాలు బయటపడ్డాయి.
మధుసూదనాచారి, గండ్ర అనుచరుల మధ్య ఘర్షణ చెలరేగింది.ప్రారంభోత్సవ శిలాఫలకంలో మధుసూదనాచారి పేరు లేదని అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో గండ్ర అనుచరులు, మధుసూదనా చారి అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కాగా ఈ తోపులాట మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవితల ముందే జరగడం గమనార్హం.