బాబోయ్.. నమ్రత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా..?

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మహేష్ బాబు భార్య గానే కాకుండా మిస్ ఇండియా గా, హీరోయిన్ గా కూడా నమ్రత మనందరికీ సుపరిచితమే.

 Special Story Namrata Shirodkar,namrata Shirodkar,mahesh Babu, Namrata Shirodka-TeluguStop.com

మొదట సినిమాలలోకి రాకముందు మోడలింగ్ లోకి అడుగుపెట్టిన నమ్రత 1993లో మిస్ ఇండియా,మిస్ ఏషియా పసిఫిక్ గా ఎంపిక అయింది.ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ ఇచ్చి పలు హిందీ సినిమాలలో నటించి మెప్పించింది.

Telugu Mahesh Babu, India, Tollywood, Vamshi-Movie

అనంతరం మహేష్ బాబు తండ్రి కృష్ణ నటించిన వంశీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ.ఇది ఇలా ఉంటే తాజాగా నేడు నమ్రత పుట్టినరోజు.తాజాగా నమ్రత తన 51 వసంతంలోకి అడుగు పెట్టింది.51 వసంతంలోకి అడుగు పెట్టినప్పటికీ ఆమె ఇప్పటికీ మూడు పదుల వయసులో ఉండే అమ్మాయిలాగా కనిపిస్తూ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది.ఇకపోతే నమ్రత విషయానికి వస్తే నమ్రత 1972 జనవరి 22న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది.

Telugu Mahesh Babu, India, Tollywood, Vamshi-Movie

ఈమె అక్క శిల్పా శిరోద్కర్ కూడా బాలీవుడ్లో పలు సినిమాలలో నటించి మెప్పించింది.అంతేకాకుండా నమ్రత నానమ్మ మీనాక్షి శిరోద్కర్ గారు కూడా ప్రముఖ మరాఠీ నాటి.ఆమె 1938లో బ్రహ్మచారి అనే సినిమాలో నటించారు.

ఇక నానమ్మ వారసత్వంతో శిల్పా,నమ్రత లు హీరోయిన్స్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.అలా నమ్రత ఫ్యామిలీలో కేవలం ఆమె మాత్రమే కాకుండా ఆమె అక్క అలాగే తన నానమ్మ కూడా ప్రముఖ హీరోయిన్సే.

Telugu Mahesh Babu, India, Tollywood, Vamshi-Movie

ఇకపోతే నమ్రత మహేష్ బాబులు వంశీ సినిమా సమయంలో ఒకరినొకరు ఇష్టపడడంతో పాటు ఆ తర్వాత కొంతకాలం పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత 2005 ఫిబ్రవరి 10న ముంబైలోని ప్రముఖ హోటల్లో వివాహం జరిగింది.ఇక పెళ్లి తర్వాత మహేష్ బాబు కెరీర్ బాగా ఊపందుకుంది అని చెప్పవచ్చు.అంతేకాకుండా ఇప్పటికే మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని పనులను శిరోద్కర్ దగ్గరుండి చూసుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube