మోడీని హిందీలో పలకరించిన జపాన్ సూపర్ కిడ్స్.. దెబ్బకు మోదీ ఫిదా!

ప్రస్తుతం భారత ప్రధాని మోడీ జపాన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసినదే.భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా 4 దేశాల క్వాడ్ సదస్సులో పాల్గొనే క్రమంలో టోక్యోలో ప్రవాస భారతీయుల నుంచి అపూర్వ స్పందన లభించింది.

 Japanese Kids Greeting Modi In Hindi During Japan Tour Viral Video Details, Jap-TeluguStop.com

భారత ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్‌ రాజధాని టోక్యోలో అపూర్వ ఘనస్వాగతం లభించింది.ముఖ్యంగా ఇక్కడ జపనీస్ పిల్లలు మోదీకి భారతీయ భాషల్లో ఘనస్వాగతం పలికి, ప్రధానిని ఖుషి చేసారు.

టోక్యోలోని న్యూఒటానీ హోటల్ వద్ద ప్రధాని మోదీ బస చేశారు.ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న జపనీస్ పిల్లలు సందడి చేశారు.

జపనీస్ పిల్లలు అయినప్పటికీ, మోదీతో హిందీలో చక్కగా మాట్లాడి మోడీని విస్మయం చెందేలా చేసారు.అక్కడ ఓ పిల్లాడితో వావ్! హిందీ ఎక్కడ నేర్చుకున్నావ్? అంటూ మోదీ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కొందరు పిల్లలు హిందీలోనే మోదీతో సంభాషించారు.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో డ్రాగన్ చైనాను నిలువరించడంతో పాటు రక్షణ, వ్యాపార, దౌత్య సంబంధాలను బలోపేతానికి భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ‘క్వాడ్ కూటమి’గా ఏర్పాటుచేసిన ఈ ఏడాది సదస్సుకు భారత ప్రధాని జపాన్‌లో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా, టోక్యో ఎయిర్ పోర్టులో మోదీకి అధికారిక, సైనిక స్వాగతం లభించింది.మోదీ హోటల్ వద్దకు చేరుకోగానే, భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు అక్కడికి చేరుకుని మోదీ.మోదీ.అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సదరు వీడియోలను మనం ఇక్కడ గమనించవచ్చు.హర్ హర్ మోదీ.

వందేమాతరం.భారత్ మాతాకీ జై.అనే నినాదాలతో ప్రవాస భారతీయులు మోడీని పులకింపజేశారు.వారి అభిమానానికి మోడీ ఎంతగానో సంతోషించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube