వైరల్: బాహుబలి ముల్లంగిని చూశారా? దానిని ఎత్తడానికి మీరు సరిపోరు!

ఈ సువిశాల ప్రపంచంలో రకరకాల అభిరుచులు గల మనుషులు వున్నారు.కొందరికి వంటలు, సంగీతం సాహిత్యం వంటివి ఇష్టమైతే, మరికొందరికి డ్యాన్స్, స్విమ్మింగ్, కరాటే… వంటి అనేక రకాల హాబిట్స్ ఉంటాయి.

 Japanese Company Sets World Record With 101-pound Radish,japanese Company,guinne-TeluguStop.com

ఇలాంటి హాబీల్లో ఒకటే వ్యవసాయం.అయితే దురదృష్టవశాత్తు చాలామంది దీనిని ఒక హబిలాగా కాకుండా ఒక పనిలాగానే చూస్తారు.

అందుకే మనవాళ్ళు ఈ రంగంలో అంతగా రాణించలేరు.అయితే చాలామంది తమకు అందుబాటులో ఉన్న వాటితోనే కూరగాయలు లేదా పండ్లను చాలా చక్కగా పండించడం మనం చూడవచ్చు.

అలా కూరగాయలు పండించడానికి చాలా సమయం, కష్టంతో పాటు నైపుణ్యాన్ని కూడా మనోళ్లు జోడిస్తారు.అందుకే వారు అద్భుతాలు చేస్తారు.ఈ క్రమంలో సరికొత్త రికార్డులు సైతం సృష్టించాలని భావిస్తారు.ఇప్పటికే గుమ్మడికాయ, పుచ్చకాయ వంటి ఉత్పత్తులతో రికార్స్ ఉండగా.తాజాగా ఇప్పుడు బాహుబలి వంటి ముల్లంగి( Radish ) గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకోవడం విశేషం అని చెప్పుకోవాలి.

ఈ ఫీట్ సాధించింది మాత్రం జపనీస్ అని చెప్పుకోవాలి.ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల తయారీదారు మందా ఫెర్మెంటేషన్ కో లిమిటెడ్ కంపెనీ( Manda Fermentation Co., Ltd.) అత్యంత భారీ ముల్లంగిని పండించి.సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.ఈ బరువైన ముల్లంగి బరువు 45.865 కేజీలున్నట్లు సమాచారం.ఇక్కడ పులియబెట్టిన బొటానికల్ ముడి పదార్థాల నుండి సప్లిమెంట్లను.ప్రత్యేక ఎరువులను ఉత్పత్తి చేస్తుంది.ఈ కంపెనీ ప్రతి సంవత్సరం అసాధారణమైన ముల్లంగిని పెంచుతారు.కాగా ఈ అత్యంత బరువైన ముల్లంగి వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube