సోషల్ మీడియాలో( Social media ) వైరల్ అవుతున్న వీడియోలలో ఎక్కువగా ఫన్నీ వీడియోలో ఉంటాయి.ఎందుకంటే వాటిని నెటిజన్లు పదేపదే చూస్తుంటారు కాబట్టి.
అందులోనూ చిన్న జంతువులు, పెద్ద జంతువులను భయపెట్టినపుడు ఇంకాస్త ఇంటరెస్ట్ గా చూస్తూ వుంటారు.ఇకపోతే ఎక్కడైనా సాధారణంగా పిల్లులను ( Cats ) కుక్కలే వేటాడతాయి.
ఎలుకలను పిల్లులు, పిల్లులకు కుక్కలు వేటాడమే సృష్టిధర్మం అని చెబుతూ వుంటారు.అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా సృష్టికి విరుద్ధంగా ఉందని మీరే చెబుతారు.

అవును, ఈ వీడియోలో ఓ కుక్కను ఏకంగా 5 పిల్లులు చుట్టుముట్టి తాట తీయడం చూడవచ్చు.దాంతో ఎటువైపు అడుగు వేయాలో తెలియని ఆ కుక్క ( Dog ) తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోవడం చూడవచ్చు.దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది.వీడియోని ఒకసారి గమనిస్తే, ఎవరూ లేని చోట ఒక కుక్కను చూసిన పిల్లులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి దాన్ని జాగ్రత్తగా చుట్టముట్టడం చూడవచ్చు.

అలా మొత్తం 5 పిల్లులు తనను చుట్టుముట్టడంతో కుక్క వాటిని ప్రతిఘటించలేనని చేతులు ఎత్తేయడం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు.అలా బిత్తరచూపులు చూసిన ఆ కుక్క ఒక్కసారిగా అక్కడ నుంచి బయటపడి.పక్కనే ఉన్న పొదలవైపుకు పరుగెత్తడం చూడవచ్చు.కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదా సరదా కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలో కొందరు సందేశాలు కూడా ఇస్తున్నారు.ఎలాంటి బలహీనులైనా కలిసిగట్టుగా అడుగు వేస్తే ఎలాంటి బలవంతుడైనా వెనకడుగు వేయాల్సిందే అని కామెంట్లు పెడుతున్నారు.







