ఐపీఎల్ ( IPL ) వస్తుందంటే చాలు క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటారు.ఎందుకంటే ఈ 20 ఓవర్ల లీగ్‌లో సస్పెన్షన్ థ్రిల్లర్ల మ్యాచ్‌లు సూపర్‌గా ఎంటర్‌టైన్ చేస్తాయి.
బ్యాటర్లు స్టేడియం పైకప్పులు తాకేలా కొట్టే సిక్సర్లు, బౌలర్లు మ్యాజిక్‌తో పడగొట్టే వికెట్లు, కళ్లు చెదిరే క్యాచ్‌లు ఉర్రూతలూగిస్తుంటాయి.మొత్తంగా ఐపీఎల్ ఒక హోల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ అని చెప్పవచ్చు.
కాగా ఈ ఏడాది సీజన్ మార్చి 31న ప్రారంభం కానుంది.ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ట్రోఫీ కోసం 10 జట్లు 52 రోజులపాటు తలపడనున్నాయి.
ఈ 16 సీజన్ కొత్త రూల్స్‌తో సరికొత్తగా అలరించనుంది.ఆ రూల్స్ వల్ల కొత్తగా కనిపించే అంశాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
సొంత స్టేడియాలలో మ్యాచ్‌లు:
కరోనా వల్ల గత మూడు సీజన్లు బయో బబుల్ స్టేడియాలకే మ్యాచ్‌లు పరిమితమయ్యాయి.కానీ ఈ సారి మాత్రం ఓల్డ్ స్టైల్‌లో హోమ్ అండ్ అవే ఫార్మాట్‌లోనే మ్యాచ్‌లు కండక్ట్ చేస్తారు.
ఒక్కో టీమ్ హోమ్ టౌన్‌లో 7 మ్యాచ్‌లు ఆడనుండగా.అవే టౌన్‌లోని స్టేడియాలలో మరో 7 మ్యాచ్‌లు తాయి.అంటే ఫ్యాన్స్ ఈసారి హైదరాబాద్ టీమ్ మ్యాచ్లను హైదరాబాద్‌లో, చెన్నై మ్యాచ్‌లను చెన్నైలో ఇలా చూడగలుగుతారు.

వైడ్/నోబాల్‌కు రివ్యూ:
ఈ సారి సీజన్‌లో ప్రతి టీమ్‌కి కూడా మూడు రివ్యూలు లభిస్తాయి.టీమ్ మెంబర్స్ వైడ్, నోబాల్‌కు కూడా రివ్యూ తీసుకోవడం ఈసారి ప్రత్యేకంగా మారింది.వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో వైడ్, నోబాల్స్ రివ్యూస్( Wide No ball review ) ఆల్రెడీ అమలు చేశారు.
వైడ్, నోబాల్స్ విషయంలో అంపైర్లు నిర్ణయాలు తప్పు కావడం, ఫలితంగా మ్యాచ్ ఫలితాలే మారిపోవడం గతంలో చాలాసార్లు వెలుగు చూసాయి.వీటి వల్ల విమర్శలు వెల్లువెత్తాయి.ఈ సమస్యకు పరిష్కారంగా వైడ్, నోబాల్స్‌కు రివ్యూ తీసుకునే వెసులుబాటను అందించారు.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్:
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్( Impact Player Rule ) ఈసారి ఉపయోగించుకోవచ్చు కాబట్టి తుది జట్టులో లేని ఓ ఆటగాడిని మ్యాచ్ స్టార్ట్ అయ్యాక కూడా మైదానంలోకి దిగొచ్చు.ఇంపాక్ట్ ప్లేయర్ బ్యాటింగ్ చేయవచ్చు, లేదా బౌలింగ్ కూడా చేసుకోవచ్చు.మ్యాచ్ పరిస్థితులను బట్టి ఈ మెంబర్స్ బోలింగా లేక బ్యాటింగా అనేది ఎంచుకోవచ్చు.
అయితే మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందుగానే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ పేరును అంపైర్లకు తెలియజేయాల్సి ఉంటుంది.అలాగే ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లోనే అతడిని బరిలోకి దింపాల్సి ఉంటుంది.
ఇంపాక్ట్ ప్లేయర్ బరిలోకి దిగిన తర్వాత ఒక ప్లేయర్ బయటికి వెళ్తాడు ఆ ప్లేయర్ మళ్లీ వెనక్కి రాడు.దీనివల్ల మ్యాచ్ మరింత రసవత్తరంగా మారుతుంది.







