పవన్ కీలకపాత్ర పోషిస్తారా ? మంత్రి పదవి అందుకే వద్దనుకుంటున్నారా ?

మరికొద్ది రోజుల్లో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది.ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

 Janasena Chief Pawan Kalyan Not Interested In Minister Post Details, Tdp. Janase-TeluguStop.com

దీంతో మంత్రివర్గం పైన అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు.ఎవరెవరిని మంత్రులుగా తీసుకోవాలి ? ఏ శాఖలు కేటాయించాలని లోతుగా చర్చిస్తున్నారు.కొత్త క్యాబినెట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) కీలక పదవులు దక్కబోతున్నాయనే హడావుడి జరుగుతోంది.పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రిగా( Deputy CM ) అవకాశం దక్కబోతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

దీంతో పాటు టిడిపి, జనసేన, బిజెపి నుంచి మంత్రులుగా ఎవరెవరిని తీసుకోవాలనే దానిపైన ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయి.

Telugu Cm Chandrababu, Jagan, Lokesh, Pavan Kalyan, Pawankalyan, Pawan Kalyan, T

మొత్తంగా 25 మంది మంత్రివర్గంలో టిడిపి నుంచి చంద్రబాబుతో సహా 20 మంది, జనసేన నుంచి ముగ్గురు, బిజెపి నుంచి ఇద్దరికీ అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం జరిగినా ఇప్పుడు పవన్ మాత్రం మంత్రి పదవి తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదట.మంత్రిగా కంటే జనసేన పార్టీ( Janasena ) అధినేత గానే ప్రభుత్వానికి సహకారం అందిస్తూ, ,ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కీలక పాత్ర పోషించాలనే ఆలోచనలతో పవన్ ఉన్నట్లు సమాచారం.దీనిపైన త్వరలోనే పవన్ నిర్ణయం ఏంటి అనేది అధికారికంగా ప్రారంభించింది.

Telugu Cm Chandrababu, Jagan, Lokesh, Pavan Kalyan, Pawankalyan, Pawan Kalyan, T

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం మంత్రి పదవి తీసుకునే విషయంలో అంత ఆసక్తి చూపించడం లేదట.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడంతో పూర్తిగా పార్టీ వ్యవహారాలపైనే దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారట.గతం లో అధికారంలో ఉన్న సమయంలో పార్టీ క్యాడర్ పట్టించుకోలేదనే విమర్శలు ఉండడంతో, ఇప్పుడు పార్టీ పైనే ఫోకస్ చేయాలని భావిస్తున్నారట.జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ , కొణతాల రామకృష్ణ , బొలిశెట్టి సత్యనారాయణకు క్యాబినెట్ లో అవకాశం ఉండబోతోందట బీసీ వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందట.

టిడిపి నుంచి నిమ్మకాయల చినరాజప్ప లేదా నిమ్మల రామానాయుడు కు కాపు కోటా లో డిప్యూటీ సీఎం గా ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube