వంద సభలు, రోడ్ షోలకి ప్లాన్ చేస్తున్న జగన్

వైసిపి అధినేత, ఏపీ సీఎం రాబోయే ఎన్నికలను అంత ఆషామాషీగా తీసుకోవడం లేదు.కచ్చితంగా రెండోసారి అధికారంలోకి రావాలని, దానికి అనుగుణంగా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు.

 Jagan Is Planning For Hundreds Of Meetings And Road Shows, Jagan, Ysrcp, Ap Gove-TeluguStop.com

టిడిపి, జనసేన, బిజెపిలు కలిసి వచ్చినా తమ విజయాన్ని ఆపలేరనే ధీమాతో జగన్ ( jagan )ఉన్నారు.వైసిపి ప్రభుత్వం ఇప్పటి వరకు అందించిన సంక్షేమ పథకాలే తమను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయనే నమ్మకంతో ఉన్నారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనం బాట పట్టిన జగన్ ఇక ముందు ముందు భారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజలకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ సభలు నిర్వహించగా, ప్రస్తుతం బస్సు యాత్ర చేపట్టి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ పర్యటిస్తూ, భారీ సభలను నిర్వహిస్తున్నారు.

Telugu Ap, Jagan, Jaganhundreds, Jagan Roads, Telugudesam, Ysrcp-Politics

ఇక ఎన్నికల సమయం మరింత దగ్గర పడిన నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా  మరింత విస్తృతంగా పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.ఏపీవ్యాప్తంగా మొత్తం 100 సభలు, రోడ్డు షోలు నిర్వహించాలనే ప్లాన్ తో జగన్ ఉన్నారు.ప్రతి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో( assembly constituencies ) రోడ్డు షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అవసరాన్ని బట్టి హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటన చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత జగన్ షెడ్యూల్ ను ఖరారు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.వరుసగా సభలు, సమావేశాలు, రోడ్డు షోల ద్వారా జనాల దృష్టిని ఆకర్షించి, మరోసారి తమకు తిరుగు లేకుండా చేసుకోవాలనే ప్లాన్ తో జగన్ ఉన్నారు.

Telugu Ap, Jagan, Jaganhundreds, Jagan Roads, Telugudesam, Ysrcp-Politics

ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) , జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లు వరుసగా సభలు, సమావేశాలు, రోడ్డు షోలు నిర్వహిస్తూ వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవడంతో, అంతకంటే భారీగా సభలు, రోడ్డు షోలు నిర్వహించి, విపక్ష పార్టీల వైపు జనాలు ఆకర్షితులు కాకుండా చూడడమే లక్ష్యంగా జగన్ ఉన్నారు.క్షేత్రస్థాయిలో వైసిపి కేడర్ లోను ఉత్సాహం నింపి, వారు ప్రజల్లో తిరుగుతూ, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గురించి జనాలకు అర్థమయ్యేలా వివరించడంతో పాటు, విపక్ష పార్టీల ఎత్తుగడలను తిప్పికొట్టే విధంగా వారికిదిశా నిర్దేశం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube