స్క్రీన్ మీద చాలా సార్లే అవుతోంది.. ఇంద్రజతో సుధీర్ కామెంట్లు

తెలుగు బుల్లితెరపై తన టాలెంట్ ఏంటో నిరూపించుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆర్టిస్టు ఎవరంటే సుడిగాలి సుధీర్ పేరు మాత్రమే వినిపిస్తుందిజబర్దస్త్ షో తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈ బుల్లితెర హీరో ఓ స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.ఈయనకు ప్రస్తుతం ఒక స్టార్ హీరోకు ఉన్నదాని కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది.

 It Is Happening So Many Times On The Screen Sudheer Comments With Indraja And It-TeluguStop.com

జబర్దస్త్ లో కమెడియన్ గా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.అలా తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

కెరీర్ మొదట్లో సుధీర్ మ్యాజిక్ లు చేసేవాడు.అలా పలు షోలలో మ్యాజిక్ లు చేసి జబర్దస్త్ లో అడుగు పెట్టాడు.

అంతే అలా జబర్దస్త్ తో సుధీర్ తలరాత మొత్తం మారిపోయిందిఇక జబర్దస్త్ లో యాంకర్ రష్మీ తోసుధీర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదనే చెప్పాలి.తనతో జబర్దస్త్ లో లవ్ ట్రాక్ నడుపుతూ తెగ ఆకట్టుకున్నాడు.

అలా అందరి దృష్టిలో పడ్డాడు సుధీర్.నిజానికి ఈ షో లో వీరిద్దరి మధ్య జరిగే పెర్ఫార్మెన్స్ బాగా హైలెట్ గా ఉంటుంది.

ఇక సుధీర్ ఈ షో ద్వారా వెండితెరపై అవకాశం అందుకున్నాడు.పలు సినిమాలలో సహాయ పాత్రల్లోనూ నటించాడు.

Telugu Indraja, Jabardasth, Marrege, Rashmi, Sridevidrama, Sudheer, Vishnu Priya

హీరోగా కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు.అటు వెండి తెరపై, ఇటు బుల్లితెరపై సుధీర్ కు బాగా కలిసొచ్చింది.ఇక బుల్లి తెర పై కమెడియన్ గానే కాకుండా యాంకర్ గా కూడా అడుగు పెట్టి ప్రేక్షకుల మనసును మరింత దోచుకున్నాడు సుధీర్.గతంలో పోవే పోరా అనే షో తో విష్ణు ప్రియా తో కలిసి యాంకర్ గా చేసి మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

ఇక ఈటీవీలో ప్రసారమైన ఢీ షో లో టీం లీడర్ గా చేశాడు.ఇందులో కూడా రష్మీ తో బాగా సరసాలాడుతూ సందడి చేశాడు.పైగా వీరిద్దరికీ గతంలో జబర్దస్త్ వేదికపై వివాహం కూడా జరిగింది.అదంతా రేటింగ్ కోసమే చేస్తారన్న సంగతి తెలిసిందే.

ఇక మల్లెమాల ప్రొడక్షన్ లో గత కొంత కాలం నుండి శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా యాంకర్ గా మెప్పిస్తున్నాడు.

Telugu Indraja, Jabardasth, Marrege, Rashmi, Sridevidrama, Sudheer, Vishnu Priya

అందులో అప్పుడప్పుడు సుధీర్ పర్ఫార్మెన్స్మాత్రం బాగా హైలెట్ గా నిలుస్తుంది.ముఖ్యంగా అతడు జడ్జిగా ఉన్న అలనాటి తార ఇంద్రజ తో చేసే సందడి అంతా ఇంతా కాదు.తనను అమ్మతో పోలుస్తూ తెగ మురిసిపోతుంటాడు.

ఇదిలా ఉంటే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కి సంబంధించిన ఒక వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.అందులో ఇంద్రజ తో సుధీర్ తెగ కామెంట్లు చేశాడు.

Telugu Indraja, Jabardasth, Marrege, Rashmi, Sridevidrama, Sudheer, Vishnu Priya

సుధీర్ అందులో నలుగురు అమ్మాయిలతో కలిసి బాగా సందడి చేశాడు.పైగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మరోసారి అందరి దృష్టిలో పడ్డాడు.ఇక స్కిట్ అనంతరం ఇంద్రజ సుధీర్ తో మాట్లాడుతూ.తనను పెళ్ళికొడుకు గెటప్ లో చూడాలని కోరిక తీరిందని అనడంతో వెంటనే సుధీర్ స్క్రీన్ మీద చాలా సార్లే అవుతుంది అని కామెంట్ చేశాడు.

అంటే ఇంతకుముందు కూడా ఆయన పెళ్ళికొడుకు గెటప్ లో కనిపించానని అన్నట్లుగా తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube