ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. అమెరికాలో ‘‘కాషాయ’’ మద్ధతుదారుల సంబరాలు

2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.సుదీర్ఘ కాలంగా అధికారంలో వుండటం.

 Indian American Supporters Of Bjp Celebrate Party's Victory In Four States , Ind-TeluguStop.com

రైతు ఆందోళనలు వంటి అంశాలు కాషాయానికి ప్రతికూలంగా పరిణమిస్తాయని అంతా భావించారు.కానీ ఈ భ్రమలను పటాపంచలు చేస్తూ బీజేపీ .కీలకమైన ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో విజయం సాధించింది.దీంతో కాషాయ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాయి.

అటు విదేశాలలో వున్న బీజేపీ మద్ధతుదారులు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.గత ఆదివారం అమెరికా అంతటా వేడుకలు జరిగాయి.

బీజేపీ అమెరికా విభాగమైన ‘Overseas Friends of BJP-USA (OFBJP) వాలంటీర్లు ఆ పార్టీ తరపున రెండు నెలలుగా ప్రచారం నిర్వహించారు.ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‌కు మద్ధతుగా నిలుస్తూ.

వీరికి ఓటు వేయాల్సిందిగా ఫోన్లు ద్వారా అభ్యర్ధించారు.ఈ సందర్భంగా.

OFBJP జాతీయాధ్యక్షుడు అడపా ప్రసాద్ మాట్లాడుతూ.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విక్టరీ సాధించిన తర్వాత జేపీ నడ్డా నుంచి తమకు ఫోన్ వచ్చిందని చెప్పారు.

ఎన్నికల్లో సహాయ సహకారాలు అందించినందుకు OFBJPని అభినందించినట్లు ప్రసాద్ పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ గెలవాల్సిన అవసరం వుందని అడపా ప్రసాద్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ పునాదులను పటిష్టం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని .ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల బీజేపీ విజయం సాధించడాన్ని బట్టి… ఓటర్లు మోడీ ప్రభుత్వం వెనుక గట్టిగా వున్నారని ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

న్యూయార్క్‌లోని మరో భారతీయ- అమెరికన్ సంస్థ కూడా వీకెండ్‌లో బీజేపీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది.ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఇది చారిత్రాత్మక విజయమని.37 ఏళ్ల తర్వాత ఒకేపార్టీకి రెండోసారి ఓటర్లు అధికారాన్ని కట్టబెట్టారు.ఇది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై, ఆయన పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని ‘‘అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ’’ అధ్యక్షుడు జగదీష్ సేవాని అన్నారు.ప్రధాని మోడీ పేద, రైతు, అభివృద్ధి అనుకూల విధానాలకు ఇది ఆమోదమని సేవాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Indian American Supporters Of BJP Celebrate Partys Victory In Four States

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube