సమ్మర్ సీజన్ రానే వచ్చింది.మెల్ల మెల్లగా ఎండలూ పెరుగుతున్నాయి.
అయితే ఈ సీజన్‌లో విరి విరిగా దొరికే పండ్లలో కర్బూజ ఒకటి.దీనిని మస్క్ మెలోన్ అని అంటుంటారు.
ఈ పండు రుచిగా ఉండటమే కాదు.ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నిటినో కలిగి ఉంటుంది.
కర్బూజలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది.అందుకే ఆరోగ్య పరంగా ఈ పండు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి కర్బూజ అద్భుతంగా సహాయపడుతుంది.అవును ఇప్పుడు చెప్పబోయే విధంగా కర్బూజను తీసుకుంటే సూపర్ ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
మరి ఇంకెందుకు అలస్యం అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.ముందుగా ఒక కర్బూజ పండును తీసుకుని పైతొక్క, లోపలి గింజలు తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.
ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు కర్బూజ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల రోల్డ్ ఓట్స్, ఐదు బాదం పప్పులు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక కప్పు కొవ్వు తీసేసిన పాలు, ఒక కప్పు నీళ్లు వేసి గ్రీీీడ్న్ చేసుకోవాలి.ఆపై ఈ కర్బూజ స్మూతీని గ్లాస్‌లోకి సర్వ్ చేసుకుని బ్రేక్ ఫాస్ట్ సమయంలో సేవించాలి.

ఇలా చేస్తే గనుక బాడీలో పేరుకుపోయిన కొవ్వంత క్రమంగా కరిగిపోయి.వెయిట్ లాస్ అవుతారు.అంతేకాదు, పైన చెప్పిన కర్బూజ స్మూతీని డైట్‌లో చేర్చుకోవడం వల్ల నీరసం, అలసట వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.
అతి ఆకలి తగ్గుతుంది.శరీరం చల్లగా ఉంటుంది.
సమ్మర్‌లో ఎండలను తట్టుకునే ఎనర్జీ లభిస్తుంది.వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.
మరియు చర్మం కూడా ఎల్లప్పుడూ గ్లోగా మెరిసిపోతూ ఉంటుంది.







