మన శరీరానికి అవసరం అయ్యే ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ ఇ ఒకటి.కానీ, విటమిన్ ఇ యొక్క ప్రయోజనాలు ఏంటి.? అది మన శరీరానికి ఎందుకు అవసరం.? అసలు విటమిన్ ఇ ఏయే ఆహారాల్లో లభిస్తుంది.? అన్న విషయాలపై చాలా మందికి అవగాహన ఉండదు.ఈ నేపథ్యంలోనే విటమిన్ ఇ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ `ఇ( Vitamin E )`ను బ్యూటీ విటమిన్, సెక్స్‌వల్ విటమిన్ అని కూడా పిలుస్తారు.

చర్మ ఆరోగ్యానికి విటమిన్ ఇ ఎంతో అవసరం.ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా విటమిన్ ఇ అడ్డుకట్ట వేస్తుంది.చర్మంపై ఏమైనా గాయాలు అయినా త్వరగా తగ్గుముఖం పడతాయి.
విటమిన్ ఇ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి స్కిన్ ను మృదువుగా, కాంతివంతంగా మెరిపిస్తుంది.చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
అందుకే బ్యూటీ ప్రోడెక్ట్స్ లో విటమిన్ ఇను అధికంగా వాడుతుంటారు.జుట్టు సంరక్షణకు విటిమన్ ఇ ఉపయోగపడుతుంది.
హెయిర్ గ్రోత్( Hair Growth ) ను ఇంప్రూవ్ చేయడానికి, హెయిర్ రూట్స్ ను స్ట్రోంగ్ గా మార్చడానికి విటమిన్ ఇ హెల్ప్ చేస్తుంది.అలాగే ప్రత్యుత్పత్తి అవయవాల పనితీరలోనూ విటమిన్ ఇ కీలక పాత్రను పోషిస్తుంది.
స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వం తలెత్తకుండా రక్షిస్తుంది.గర్భస్రావం అయ్యే రిస్క్ ను తగ్గించడానికి కూడా విటమిన్ ఇ సహాయపడుతుంది.

శరీరంలో క్రిములు పేరుకుపోవడాన్ని నిరోధించడానికి, ఊపిరితిత్తులలో కాలుష్య కారకాలను చేరకుండా అడ్డుకట్ట వేయడానికి, గోళ్ల పెరుగుదలకు విటమిన్ ఇ ఉపయోగపడుతుంది. కాన్సర్స్( Cancer )కి వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు కూడా విటమిన్ ఇ కి ఉన్నాయి.ఇక ఆల్మండ్స్, సన్ ఫ్లెవర్ సీడ్స్, అవకాడో, కివి, వేరుశనగలు, పాలకూర, గుడ్డు, మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.మరియు చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి, జుట్టు సంరక్షణకు విటమిన్ ఇ ఆయిల్ ను ఉపయోగించవచ్చు.







