తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది.అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగానే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.ఈ మేరకు రేపు మధ్యాహ్నం సూర్యాపేట జిల్లాలో జరగనున్న బీజేపీ జనగర్జన సభకు ఆయన హాజరుకానున్నారు.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం అయ్యే అవకాశం ఉంది.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.







