సౌరవ్ గంగూలీ బిజేపిలో చేరుతున్నారా?

వెస్ట్ బెంగాల్ లో ఈసారి జరిగే ఎన్నికలలో అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం బిజేపి తెగ ప్రయత్నిస్తుంది.ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అక్కడ ప్రజలలోకి వెళ్ళడానికి బిజేపి కావలసిన వ్యూహ రచన చేస్తుంది.

 Is Sourav Ganguly Joining Bjp?, Sourav Ganguly, Eden Gardens, Bcci, West Bengal,-TeluguStop.com

ఇలాంటి టైంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బిజేపిలో చేరుతాడని ఒక ఆసక్తికర రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మరి అది నిజమా కాదో అనేది ఇప్పుడు చూద్దాం.

గతంలో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వడం కోసం అమిత్ షా సహకరించారని అందుకు బదులుగా వెస్ట్ బెంగాల్ లో జరిగే ఎన్నికలలో సౌరవ్ గంగూలీ బిజేపికి మద్దతుగా ప్రచారం చేస్తారని గత కొద్దిరోజులుగా మీడియాలో వినిపిస్తుంది.తాజాగా సౌరవ్ గంగూలీ పాఠశాల కట్టడానికి ప్రభుత్వం వద్ద తీసుకున్న రెండు ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేశారు.

దానితో ఆయన ఈసారి వెస్ట్ బెంగాల్ లో జరిగే ఎన్నికలలో బిజేపి తరుపున బరిలో దిగుతారని ఓ రూమర్ పురుడు పోసుకుంది.

ఇదే విషయాన్ని సౌరవ్ గంగూలీని అడగగా ఆయన దీనిని తీవ్రంగా ఖండించారు.

బెంగాల్‌లో తన ప్రజాదరణ నమ్మకం, మంచితనం మీద నిర్మించబడింది అని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube