Sharmila : షర్మిల పోటీ చేయబోయేది అక్కడి నుంచేనా ? 

ఈసారి జరగబోయే ఏపీ ఎన్నికలు అందరికీ ఆసక్తికరంగా, ఉత్కంఠ గా మారాయి.టిడిపి , జనసేన,  బిజెపిలు( TDP, Jana Sena, BJP ) ఉమ్మడిగా పోటీ చేస్తుండగా,  వైసిపి,  కాంగ్రెస్ లు విడివిడిగా పోటీకి దిగుతున్నాయి.

 Is Sharmila Going To Compete From There-TeluguStop.com

ఎవరికి వారు గెలుపు ధీమా ను వ్యక్తం చేస్తూ,  ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని,  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా గా చెబుతున్నారు.ఇప్పటికే పూర్తిస్థాయిలో వైసీపీ తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబుతాను ప్రకటించగా, టిడిపి, జనసేన, బిజెపిలు కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశాయి.

ఇక కాంగ్రెస్( Congress ) నుంచి పోటీ చేసేందుకు చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు.ఇది ఇలా ఉంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి వైఎస్ షర్మిల దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు.

Telugu Aicc, Ap, Kadapa Mp, Pcc, Sharmila, Ys Jagan, Ys Sharmila-Telugu Politica

ముఖ్యంగా తన సోదరుడు , వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )ను టార్గెట్ చేసుకుని పదేపదే రాజకీయ,  వ్యక్తిగత విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ గా మారారు.దీంతో వచ్చే ఎన్నికల్లో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ?  ఎమ్మెల్యేగా ఎంపీగా ఏ ఆప్షన్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.అయితే షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి పోటీకి దించితే వైసీపీని దెబ్బ కొట్టవచ్చని జగన్ దూకుడు కు బ్రేకులు వేయవచ్చని,  షర్మిల( Sharmila ) ప్రభావం కనిపిస్తే క్రమంగా వైసిపి పై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేస్తోంది.

Telugu Aicc, Ap, Kadapa Mp, Pcc, Sharmila, Ys Jagan, Ys Sharmila-Telugu Politica

కడప నుంచి పోటీ చేసేందుకు షర్మిల కూడా ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే ఏఐసీసీ పెద్దలు షర్మిల తో ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది .అధికారికంగా త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడనున్నట్టు.సమాచారం .ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు ఆ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుంది.మొదటి విడత జాబితాలోనే షర్మిల పేరు ఉండబోతోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube