ఆంధ్ర బిజెపి( BJP ) అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న చిన్నమ్మ ఉరఫ్ పురందేశ్వరి( Purandeshwari ) ఆంధ్రప్రదేశ్లో బిజెపిని బలపరచడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని బాద్యతలు తీసుకున్న రోజు చెప్పుకొచ్చారు , మూలాల నుంచి పార్టీని బలవంతం చేసి దీర్ఘకాలంలో పార్టీని ఆంధ్ర రాజకీయాల్లో అధికారం దిశగా తీసుకువెళ్తామని కూడా ప్రకటించారు.ముఖ్యంగా రాష్ట్రాలలో యాక్టివ్ గా ఉన్న రెండు పొలిటికల్ పార్టీలలో ఒకదాన్ని బలహీనపరిచి దాన్ని స్థానాన్ని ఆక్రమించే విదానాన్ని పాటించే భాజపా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అదే విధానాన్ని పాటిస్తుందని కూడా విశ్లేషణలు వచ్చాయి .
అయితే బాద్యతలు చేపట్టినప్పటి నుంచి పూర్తిగా వైసిపి( YCP ) వ్యతిరేక అంశాలను మాత్రమే హైలెట్ చేస్తున్న చిన్నమ్మ టీడీపీకి బీ-టీం గా మిగిలిపోయారని కూడా వైసిపి విమర్శలు చేస్తుంది.
ముఖ్యంగా వైసీపీకి ఓట్లు వేసే వర్గాలన్నీ కూడా బిజెపికి సాంప్రదాయంగా వ్యతిరేక వర్గాలని, మైనారిటీలు దళితులు మొదటి నుంచి భాజపా వ్యతిరేక బావజాలం తోనే ఉన్నారని ,ఆవర్గాలే వైసిపికి అండగా ఉన్నాయని ఇప్పుడు వైసీపీని ఎంత విమర్శించినా ఆయా వర్గాలు బిజెపి అనుకూలంగా మారవని అలాంటప్పుడు అధికార పార్టీని టార్గెట్ చేయడం ద్వారా బిజెపిని బలపరచడం జరిగే పని కాదని కొంతమంది రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.అయితే పురందేశ్వరి ప్రధాన లక్ష్యం భాజాపాను బలపరచడం కాదని తన తండ్రి పార్టీ అయిన తెలుగుదేశం ( Telugudesam )అభ్యున్నతి కోసమే ఆమె పనిచేస్తున్నారని, బిజెపి ఆంధ్ర ప్రదేశ్లో ఎదగదనే నమ్మకంతోనే ఆమె తెలుగుదేశం అనుకూల రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా అధికార వైసీపీ పార్టీ నుంచి సెటైర్లు పడుతున్నాయి.
అయితే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా కేంద్ర పార్టీ పెద్దల సూచనలకు అనుగుణంగానే ఆమె నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప ఆమె కు వ్యక్తిగత అజెండా ఏమీ ఉండదని, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రాల అధ్యక్షులు కేవలం జాతీయ కార్యవర్గ స్టాండ్( National Executive Stand ) ను ముందుకు తీసుకువెళ్తారే తప్ప వ్యక్తిగత లక్ష్యం తో పనిచేయరని పురందేశ్వరిఅనుచరులు ఆమెను సమర్థిస్తున్నారు.ఏది ఏమైనా ఇంతకుముందు అధ్యక్షుడు సోము వీర్రాజు విధానాలకు వ్యతిరేకంగా మాత్రం పురందేశ్వరి వెళ్తున్నట్లు కనిపిస్తుంది .దీనిని బట్టి కేంద్ర భాజాపా వైసీపీ వ్యతిరేక విధానం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది.