పొంగులేటి అడుగులు.. కాంగ్రెస్ వైపే ఎందుకు ?

తెలంగాణలో ఈ మద్య పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి( Ponguleti Srinivas Reddy ) సంబంధించిన చర్చ తరచూ హాట్ టాపిక్ గానే నిలుస్తోంది.బి‌ఆర్‌ఎస్ నుంచి బహిష్కరించబడిన తరువాత ఆయన కే‌సి‌ఆర్( KCR ) ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, సవాళ్ళు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

 Is Ponguleti Srinivas Reddy Joining Congress , Congress, Ponguleti Srinivas Redd-TeluguStop.com

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కే‌సి‌ఆర్ కు ఒక్క సీటు దక్కనివ్వనని శపథం చేసిన పొంగులేటి.అందుకోసం ఆయన ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతున్నారనేదే అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న అంశం.

ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రభావ వంతమైన నాయకుడు కావడంతో పొంగులేటిని తమ పార్టీలలోకి లాకునేందుకు అటు కాంగ్రెస్, ఇటు బిజెపి గట్టిగానే పోటీ పడ్డాయి.

Telugu Congress, Telangana-Politics

ముందుగా కమలనాథులు పొంగులేటితో గట్టిగానే చర్చలు జరిపారు.అయితే ఆయన మాత్రం బీజేపీలో చేరేందుకు విముఖత చూపారు.ఇక ఆ తరువాత కాంగ్రెస్ నేతలు కూడా పొంగులేటితో సంప్రదింపులు జరిపారు.

అయితే కాంగ్రెస్( Congress ) లో చేరే విషయాన్ని మాత్రం ఆయన హోల్డ్ లో ఉంచారు.ఈ నేపథ్యంలో పొంగులేటి కొత్త పార్టీ పెట్టె అవకాశాలు కూడా ఉన్నాయని గట్టిగానే వార్తలు వినిపించాయి.

అయితే కొత్త పార్టీ విషయంలో ఆయన ఇంతవరకు ఎలాంటి స్పష్టత గాని హింట్ గాని ఇవ్వలేదు.ఇదిలా జరుగుతుండగానే కర్నాటక ఎన్నికల్లో( Karnataka elections ) కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం పొంగులేటి కాంగ్రెస్ వైపు చేరేందుకే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని ఇన్ సైడ్ టాక్.

Telugu Congress, Telangana-Politics

అయితే ఆయన కాంగ్రెస్ వైపు చూడడానికి కారణం లేకపోలేదు.ఎందుకంటే ప్రత్యేక పార్టీ పెడితే ప్రధాన పార్టీల పోటీని తట్టుకోవడం కష్టం.అలాగే బీజేపీలో చేరితే సరైన ప్రాధాన్యం లభిస్తుందా అంటే చెప్పడం కష్టమే.ఎందుకంటే ఇతర పార్టీల నుంచి బీజేపీలో ( BJP )చేరిన చాలమంది నేతలకు సరైన ప్రాధాన్యం కల్పించలేదు బీజేపీ అధిష్టానం.

దీంతో పొంగులేటి ముందు ఉన్న ఒకే ఒక్క మార్గం కాంగ్రెస్ గూటికి చేరడం.అందుకే ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ వైపే ఎక్కువగా చూస్తున్నారని తెలుస్తోంది.ఇప్పటికే హస్తం గూటికి చేరేందుకు అన్నీ ఏర్పాట్లు కూడా ఆయన పూర్తి చేసుకున్నారట.దాంతో త్వరలోనే అధికారికంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం దాదాపు ఖాయమైందనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube