జగన్ బంధువు , ఒంగోలు వైసిపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి( MLA Balineni Srinivas Reddy ) వ్యవహారం గత కొంతకాలంగా ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి బాలినేని తీవ్ర అసంతృప్తితోనే ఉంటున్నారు.
ఒక దశలో ఆయన పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరిపోతున్నారనే ప్రచారం జరిగింది.ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి కి మధ్య వైరం నడుస్తోంది.
ఈ క్రమంలోనే సుబ్బారెడ్డి ( Subbareddy )తనకు వ్యతిరేకంగా జగన్ వద్ద ఫిర్యాదులు చేస్తున్నారు.
దీనికి తగ్గట్లుగానే జగన్ ( jagan )సైతం వచ్చే ఎన్నికల్లో బాలినేనికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపించకపోవడం, తనను పూర్తిగా పక్కన పెట్టినట్టుగా వ్యవహరిస్తుండడం వంటివి అన్నీ జగన్ బాలినేని మధ్య దూరం పెంచుతూనే వస్తున్నాయి .ఇదిలా ఉంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలు సందర్భంగా బల ప్రదర్శనకు దిగారు.ఈ సందర్భంగా తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నాననే సంకేతం ఇచ్చారు .అంతేకాకుండా ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా పోటీ చేస్తారని ప్రకటించడం సంచలనంగా మారింది.
తనకు వచ్చే ఎన్నికల్లో జగన్ టికెట్ నిరాకరించే అవకాశం ఉందని అనుమానిస్తూ.ముందుగా బాలినేని తనకు తాను టికెట్ ప్రకటించుకున్నట్టు గా కనిపిస్తున్నారు.ఇదే కాకుండా వైవి సుబ్బారెడ్డి తనకు వ్యతిరేకంగా జగన్ పావులు కదుపుతూ, తాను టిడిపిలో చేరబోతున్నాననే విషయాన్ని చెబుతున్నారనే అనుమానాలు బాలినేని లో ఉన్నాయి.
వీటన్నిటినీ లెక్కలు వేసుకునే ముందుగానే బాలినేని తనకు తాను టికెట్ ప్రకటించుకున్నారని, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒకవైపు ఆందోళన కలిగిస్తున్నా, తన ఆవేదన, పరిస్థితిని జగన్ అర్థం చేసుకుంటారనే నమ్మకంతో బాలినేని ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి కనిపిస్తుంది.