బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన విజయశాంతి ( Vijayashanthi ) బిజెపి గురించి ఎన్నో సీక్రెట్స్ లీక్ చేసింది.ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన ఒక కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మరి ఇంతకీ విజయశాంతి లీక్ చేసిన ఆ సీక్రెట్ ఏంటి.బీజేపీలో నిజంగానే బిఆర్ఎస్ ( BRS ) కోవర్టు ఉన్నారా.
అనేది ఇప్పుడు తెలుసుకుందాం.బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక బిజెపి పార్టీలో బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగారు.
కానీ పార్టీ అధిష్టానం బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డికి ఎప్పుడైతే పదవి ఇచ్చారో అప్పటినుండి బిజెపి గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోయింది.అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కి కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ కి వలసలు పెరుగుతున్నాయి తప్ప బీజేపీలోకి ఒక్కరు కూడా వెళ్లడం లేదు.
బిజెపి నుండి ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు.విజయశాంతి కూడా గత కొద్దిరోజుల్లో కాంగ్రెస్ కు వెళుతుంది అని ప్రచారం జరిగినప్పటికీ దానిమీద క్లారిటీ ఇవ్వలేదు.అనూహ్యంగా బిజెపి ( BJP ) కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది.ఇక పార్టీలోకి రావడంతోనే ఆమెకు కాంగ్రెస్ కీలక పదవి కట్టబెట్టింది.
అంతేకాకుండా మెదక్ ఎంపీ సీటు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.అయితే తాజాగా గాంధీ భవన్ లో విజయశాంతి మాట్లాడుతూ బిజెపి గురించి ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసింది.
బిజెపిలో చాలామంది బీఆర్ఎస్ కోవర్టు ఉన్నారు.ఇది నచ్చకే నేను బిజెపి పార్టీకి రాజీనామా చేశాను.అయితే కెసిఆర్ ( KCR ) ని గద్దెదించే సత్తా బిజెపి పార్టీకి ఉందని నేను అందులో ఉన్నాను.కానీ ఆ రెండు పార్టీలు ఒకటే.ఇక ఎన్నికల సమయంలో బిజెపి పార్టీ అధ్యక్షుడిని మార్చి పెద్ద తప్పు చేశారు.నేను పార్టీ అధ్యక్షుడిని మార్చే విషయంలో వ్యతిరేకించాను.
కానీ పార్టీ అధిష్టానం మాత్రం అధ్యక్షున్ని మార్చేశారు.ఇక దీనికి ప్రధాన కారణం కూడా బిజెపిలో ఉన్న బీఆర్ఎస్ కోవర్ట్ .బిజెపిలో కెసిఆర్ నాటిన ఓ మొక్క బండి సంజయ్ ( Bandi Sanjay ) ని పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించబడడానికి కారణమయ్యాడు.
ఆయన చెప్పిన మాటలు విని బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుండి తప్పించారు అంటూ విజయశాంతి సంచలన కామెంట్స్ చేసింది.అయితే విజయశాంతి పరోక్షంగా కామెంట్లు చేసింది ఈటెల రాజేందర్ ని ఉద్దేశించే అని,ఈటెల రాజేందర్ ( Etela Rajender ) వచ్చాక బిజెపి గ్రాఫ్ తగ్గిపోవడమే కాకుండా పార్టీ అధ్యక్షుడి ని కూడా మార్చింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఇక బిజెపిలో బీఆర్ఎస్ కోవర్టు ఈటెల రాజేందర్ అని అందరూ భావిస్తున్నారు.