బీజేపీ కి డీకే అరుణ ' హ్యాండ్ ' ఇవ్వబోతున్నారా ? 

తెలంగాణ బీజేపీ కి కీలకమైన ఎన్నికల సమయంలో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి.  పార్టీకి చెందిన కీలక నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేతల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.

 Is Dk Aruna Going To Join In Congress , Telangana Bjp, Dk Aruna, Telangana Gover-TeluguStop.com

  బిజెపి అసెంబ్లీ టికెట్ కేటాయించినా, పోటీ చేసేందుకు ఇష్టపడకపోవడం, ఒకవేళ బిజెపి అధిష్టానం ఒత్తిడితో ఎన్నికల్లో పోటీకి దిగినా ఓటమి ఖాయం అనే  సర్వే నివేదికలతో చాలామంది కీలక నేతలే బిజెపికి రాజీనామా చేసి , కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు .కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు.ఆయనకు మునుగోడు అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు బిజెపి అధిష్టానం నిర్ణయించినా,  అక్కడ పోటీ చేస్తే ఓటమి తప్పదనే సర్వే నివేదికలతో రాజగోపాల్ రెడ్డి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని భావించారు .అయితే అక్కడ స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, మునుగోడు నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకుని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు .

Telugu Dk Aruna, Komatiraj, Telangana Bjp, Telangana-Politics

 ఇప్పుడు అదే బాటిలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ( DK Aruna ) కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది .బిజెపి తరఫున గద్వాల్ నుంచి ఆమెను పోటీ చేయాల్సిందిగా అధిష్టానం సూచిస్తున్నా,  అక్కడ పరిస్థితులు బిజెపికి సానుకూలంగా లేకపోవడం, పోటీ చేసినా ఓటమి తప్పదనే ఆందోళన డీకే అరుణ లో కనిపిస్తోంది.అందుకే ఆమె గద్వాల నుంచి బీసీ అభ్యర్థిని పోటీకి దింపితే తాను పూర్తిగా మద్దతు ఇచ్చి గెలిపిస్తానని ఆమె అధిష్టానానికి చెబుతున్నా,  అసెంబ్లీకి అరుణను పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు.

Telugu Dk Aruna, Komatiraj, Telangana Bjp, Telangana-Politics

దీంతో తాను తన తల్లి ప్రాంతమైన నారాయణపేట నుంచి పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చినా,  అక్కడి నియోజకవర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో డీకే అరుణ ఆలోచనలో పడ్డారట.దీంతో బిజెపి నుంచి పోటీ చేసే కంటే కాంగ్రెస్ లోకి వెళ్లడమే మంచిదనే అభిప్రాయంలో అరుణ ఉన్నారట.కాంగ్రెస్ లో చేరితే మక్తల్ లేదా నారాయణపేట సీటు నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట.ఇదే విషయమే కాంగ్రెస్ కీలక నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube