ఐపీఎల్ వేలంలో పలికింది రూ.13.25 కోట్లు..2 మ్యాచ్లలో 16 పరుగులు.. ఫ్యాన్స్ ఫైర్..!

ఐపీఎల్ లో( IPL ) కొంతమంది ఆటగాళ్లు రికార్డుల మోత మోగిస్తుండగా.కొంతమంది చెత్త రికార్డులను సృష్టిస్తున్నారు.

 Ipl 2023 Harry Brook Poor Performance With Srh Leave Fans Unhappy Details, Ipl 2-TeluguStop.com

ఈ సీజన్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల కంటే తక్కువ ధర పలికిన ఆటగాళ్లే అద్భుత ఆటను ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

సన్రైజర్స్ హైదరాబాద్( SRH ) ఫ్రాంచైజీ జట్టులో ఎన్ని మార్పులు చేసిన ఫలితం మాత్రం కనిపించడం లేదు.

ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటములను చవిచూసింది.మర్ క్రమ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన పెద్దగా ఫలితం ఏం లేదు.లక్నో- హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో క్రీజ్ లో నిలబడడానికే హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు తడబడ్డారు.

ఈ సీజన్ వేలంలో రూ.13.25 కోట్లు వెచ్చించి హ్యారీబ్రూక్ ను( Harry Brook ) హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది.రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో హ్యారీబూక్ కేవలం 13 పరుగులు చేశాడు.ఇక తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో కేవలం మూడు పరుగులు చేసి వెనుతిరిగాడు.

రెండు మ్యాచ్లలో కలిపి 16 పరుగులు చేయడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

టెస్ట్ మ్యాచ్ ఆడే వారిని ఐపీఎల్ లో ఆడిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఈ సీజన్లో హ్యారీబ్రూక్ ను సొంతం చేసుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు, రాజస్థాన్ జట్లు పోటీ పడ్డాయి.1 కోటి 50 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి అడిగిపెట్టిన ఇతనిని హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.జట్టులో కీలక ప్లేయర్ అవుతాడనుకుంటే.అందుకు వ్యతిరేక దిశలో హ్యారీ బ్రూక్ కోనసాగుతున్నాడు.టెస్ట్ సిరీస్లలో అద్భుతంగా రాణించిన ఇతను ఐపీఎల్ లో తడబడుతున్నాడు.తదుపరి మ్యాచ్లో లైన హ్యారీబ్రూక్ మెరుగుగా ఆడి హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా మారి హైదరాబాద్ జట్టు గెలుపులో భాగస్వామి కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube