యూజర్లను ఆకట్టుకునేలా సరికొత్త ఫీచర్ తీసుకొస్తున్న ఫేస్‌బుక్

ఫేస్ బుక్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరి ఫోన్లలో ఫేస్ బుక్ యాప్ తప్పనిసరిగా ఉంటుంది.

 Introducing Home And Feeds On Facebook,facebook,facebook New Feature,home And Fe-TeluguStop.com

పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒక్కసారి కూడా ఫేస్ బుక్ ఓపెన్ చేయకుండా ఎవరూ ఉండలేరు.ఇక కొంతమంది అయితే ఫేస్ బుక్ లో గంటలకొద్ది గడుపుతూ ఉంటారు.

ఫ్రెండ్స్ తో ఛాటింగ్ తో పాటు ఫీడ్ చూసుకుంటూ లైక్ లు కొడుతూ ఉంటారు.అలాగే పోస్టులు పెడుతూ వాటిక వచ్చే కామెంట్స్ చూసుకుంటూ రిప్లైలు ఇస్తూ ఉంటారు.

అయితే యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఫేస్ బుక్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది.కొత్తగా రీల్స్ ను ప్రవేశపెట్టగా.వీటికి మంచి ఆదరణ లభించింది.ఇక వాట్సప్ స్టేటస్ తరహాలో ఫేస్ బుక్ లో స్టోరీ పెట్టుకునే ఆప్షన్ ను కూడా తీసుకొచ్చింది.

ఇలా అనేక కొత్త ఫీచర్లను ఫేస్ బుక్ తీసుకొస్తూనే ఉంది.

Telugu Feed, Feeds, Upd, Ups-Latest News - Telugu

తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను ఫేస్ బుక్ తీసుకొస్తుంది.ప్రస్తుతం ఫేస్ బుక్ పీడ్ మన ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తుంది.అలాకాకుండా మీకు ఎవరి నుంచి ఫీడ్ కావాలో వారిది సెలక్ట్ చేసుకుంటే వారి ఫీడ్ సపరేట్ గా చూపిస్తుంది.

దీని కోసం మెయిన్ హోమ్ ట్యాబ్ ఫీడ్స్ అనే కొత్త ట్యాబ్ తీసుకురానుంది.ఇందులో మీరు సెలక్ట్ చేసుకున్నవారి ఫీడ్ మాత్రమే కనిపిస్తుంది.అండ్రాయిస్ తో పాటు ఐఓఎస్ యూజర్లకు కూడా ఈ ఆప్షన్ తీసుకురానుంది.

ప్రస్తుతం ఇండియాలో ఈ ఆప్షన్ అందుబాటులో లేదు.

వారం రోజుల్లో ఈ కొత్త ఆప్షన్ ఇండియన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.ఆండ్రాయిడ్ యూజర్లకు ఎగువన, ఐఓఎస్ యూజర్లకు దిగువున ఈ ఆప్షన్ కనిపించనుంది.

ప్రధాన ట్యాబ్ డిస్కవరీ ఇంజిన్ ఆధారంగా మెయిన్ ట్యాబ్ లో ఫీడ్ కనిపిస్తుందని ఫేస్ బుక్ వర్గాలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube