లైగర్ బాక్సింగ్‌ సినిమానా..? రొమాంటిక్ సినిమా?

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయడం జరిగింది.

 Social Media Trolls On Liger Movie Trailer Details, Liger , Vijay Devarakonda, D-TeluguStop.com

ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి.అయితే కొందరు మాత్రం ఈ సినిమా ను ట్రోల్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా బాలీవుడ్ క్రిటిక్ గా చెప్పుకునే కమల్‌ ఆర్‌ ఖాన్‌ ఈ సినిమా ట్రైలర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.ట్రైలర్ లోని ప్రతి పాయింట్‌ ను ఆయన విమర్శించడం జరిగింది.

ముఖ్యంగా ఇది ఒక బాక్సింగ్ సినిమా నా లేదంటే రొమాంటిక్ సినిమా నా అన్నట్లుగా కమల్‌ ఆర్ ఖాన్‌ ప్రశ్నించాడు.అందుకు కారణం ఏంటీ అంటే ట్రైలర్ లో ఒక షాట్ లో విజయ్‌ దేవరకొండ బాక్సింగ్‌ రింగ్ లో ఉండి డ్రాయర్ మీద రెండు చేతులు వెనక్క ముందుకు అంటూ నడుము ఆడిస్తూ కాస్త ఎబ్బెట్టుగా యాక్ట్‌ చేశాడు.

అది వైరల్‌ అయ్యింది.

మరీ ఇలా ఏంట్రా బాబు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉండగా కమల్‌ ఆర్‌ ఖాన్‌ ఆ షాట్‌ ను మరింతగా ట్రోల్‌ చేయడం తో పాటు విమర్శించి విజయ్ దేవరకొండ ను ఒక ఆట ఆడుకున్నాడు.

సినిమా లోని ప్రతి ఎలిమెంట్‌ ను ఆయన విమర్శించాడు.విజయ్‌ దేవరకొండ ను విజయ్‌ అనకొండ అనడంతో పాటు అనన్య కనీసం యాక్టింగ్‌ చేయలేదని.దర్శకుడు పాన్‌ ఇండియా సినిమా అంటూ ఈ సినిమా ను చెప్పడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ ను ఆయన చేశాడు.

Telugu Puri Jagannath, Liger, Liger Trailer, Puri, Roamntic-Movie

లైగర్‌ సినిమా బాగోదు అన్నట్లుగా ఆయన ముందుగానే చెప్పేశాడు.ఆయన ట్రైలర్ రివ్యూ పై పూరి అభిమానులు మరియు విజయ్ దేవరకొండ అభిమానులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.ఆయన తీరు ను చాలా మంది చాలా రకాలుగా కోప్పడుతున్నారు.

ఆయనకు బుద్ది చెప్పినట్లుగా లైగర్ సినిమా సూపర్‌ హిట్ అవుతుందని చాలా మంది నమ్ముతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube