ఈమధ్యకాలంలో భారతీయ రైల్వే సరికొత్త ట్రైన్స్‌ను ట్రాక్ మీదకు తెస్తోంది.మెరుపువేగంతో దూసుకెళ్లేలా వుండే ట్రైన్స్ ని సిద్ధం చేస్తోంది.
కొత్తగా తయారు చేసిన AC డబుల్ డెక్కర్ LHB కోచ్ భారీ స్పీడ్‌తో దూసుకెళ్లి అందరినీ అబ్బురపరిచింది.ఈ కొత్త కోచ్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది.
వెస్ట్ సెంట్రల్ రైల్వేలో నిరాజస్థాన్‌లోని కోటా-నాగ్డా సెక్షన్‌లో స్పీడ్ ట్రయల్స్‌ను రైల్వే అధికారులు కండక్ట్ చేశారు.దీనికి సంబంధించిన వీడియోని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
ఈ వీడియోలో రైలు స్పీడోమీటర్ 180 kmph మార్కును తాకడం గమనించవచ్చు.
అలాగే పశ్చిమ మధ్య రైల్వే కూడా స్పీడ్ ట్రయల్ వీడియోను ట్వీట్ చేసింది.
కోటా – నాగ్డా సెక్షన్‌లో గంటకు 180 కి.మీ వేగంతో దూసుకుపోతున్న ట్రైన్ స్పీడోమీటర్‌పై ఓ లుక్కేయండి.” అంటూ వెస్ట్ సెంట్రల్ రైల్వే ఒక వీడియో పోస్ట్ చేసింది.2021లో వెస్ట్ సెంట్రల్ రైల్వే 180 kmph వేగంతో నాగ్డా-కోటా-సవాయి మాధోపూర్ సెక్షన్‌లో ఎయిర్ కండిషన్డ్ త్రీ-టైర్ ఎకానమీ క్లాస్ కోచ్‌ల ఆసిలేషన్ ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించింది.ఈ స్పీడ్‌లో ట్రైన్ ఎక్కువగా ఊగకుండా కనిపించింది.దాంతో ఇదే వేగంతో భారతీయ రైల్వే మరిన్ని ట్రైన్స్ తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంకోవైపు జబల్‌పూర్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో విస్టాడోమ్ కోచ్‌లను తీసుకురావాలని పశ్చిమ మధ్య రైల్వే నిర్ణయించడం అందరికీ తెలిసినదే.విస్టాడోమ్ కోచ్‌లలో కిటికీలకు పెద్ద గాజు పలకలు, తిరిగే సీట్లు, గ్లాస్ రూఫ్, అబ్జర్వేషన్ లాంజ్‌లు ఉంటాయి.ఈ ఫీచర్లన్నీ ప్రయాణికులు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు వీక్షించేందుకు ఉపయోగపడతాయి.2018లో ముంబయి-మడ్‌గావ్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మొదటి విస్టాడోమ్ కోచ్‌లు ప్రవేశపెట్టారు.ఆ సమయంలో ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున సానుకూల స్పందన వచ్చింది.కాగా ఇపుడు మరలా అది రిపీట్ అయ్యింది.