రష్యా నుంచి ఎస్ 400 డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుకు ప్రతిబంధకంగా మారిన అమెరికా కాట్సా చట్టం ఆంక్షల కత్తి నుంచి భారత్ ను రక్షించేందుకు యత్నాలు మొదలైన సంగతి తెలిసిందే.అమెరికా ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఇందుకు చొరవ తీసుకున్నారు.
దీనికి సంబంధించి గత వారం ఆయన ప్రవేశపెట్టిన చట్ట సవరణకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం లభించింది.ఇక్కడ గండం గట్టెక్కినప్పటికీ.
రిపబ్లికన్ల ఆధిపత్యం వున్న సెనేట్‌లో ఈ బిల్లుకు ఆమోదం లభించాల్సి వుంది.అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.
ఇకపోతే.CAATSA అనేది కఠినమైన చట్టం.ఇది 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకోవడంతో పాటు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందున్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేశం నుంచి ప్రధాన రక్షణ హార్డ్ వేర్ లను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా పరిపాలనా యంత్రాంగానికి ‘‘CAATSA’’ అధికారం ఇస్తుంది.ఈ చట్టాన్ని 2017లో తీసుకొచ్చారు.
రష్యా నుంచి రక్షణ, ఇంటెలిజెన్స్ విభాగాలలో లావాదేవీలు జరుపుతున్న ఏ దేశంపైనైనా అమెరికా ప్రభుత్వం శిక్షాత్మక చర్యలను విధించవచ్చు.

అక్టోబర్ 2018లో ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలకు సంబంధించి ఐదు యూనిట్లను కొనుగోలు చేసేందుకు రష్యాతో భారత్ 5 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది.అయితే ఈ ఒప్పందంపై భారత్ ముందుకెళితే.ఆంక్షలను విధిస్తామని అప్పటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది.
అయితే కాట్సా చట్టం ప్రకారం భారత్ పై ఆంక్షలు విధించే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఈ ఏడాది ఏప్రిల్ లో స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే ఒకవేళ భారత్‌పై చర్యలు తీసుకోవాలని అమెరికా అధినాయకత్వం భావించిన పక్షంలో దీనిని అడ్డుకునేందుకు రో ఖన్నా ప్రవేశపెట్టిన చట్ట సవరణ ఇండియాను రక్షించే అవకాశం వుంది.